Manchu Manoj: మనోజ్ ఉస్తాద్ షోలో సిద్దు జొన్నలగడ్డ!

మంచు మనోజ్ ఉస్తాద్ అనే గేమ్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ఇదివరకే మొదటి ఎపిసోడ్లో నాచురల్ స్టార్ నాని కార్యక్రమానికి హాజరై సందడి చేశారు ఇక మనోజ్ సైతం తనదైన మాట తీరుతో హీరోలను ఇరుక్కున పెట్టే ప్రశ్నలు వేస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఇలా మనోజ్ నాని మొదటి ఎపిసోడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

ఇకపోతే ఈ కార్యక్రమానికి రెండవ గెస్ట్ గా ఏ హీరో రాబోతున్నారన్న సందేహాలు అందరిలోనూ ఉన్నాయి. అయితే ఇటీవల ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి రెండో గెస్ట్ గా డీజే టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డ హాజరయ్యారని తెలుస్తుంది. ఇక ఈ హీరోని కూడా మనోజ్ ఓ రెంజ్ లో ఆడుకున్నారని తెలుస్తుంది. సిద్దు జొన్నలగడ్డ వేదిక పైకి రాగానే ఇదేంటి బాబాయి ఇలా బొక్కలు ఉన్నాయి

అనడంతో నీకు బొక్కలు ఉంటే ఇష్టం కదా అందుకే ఇలా పెట్టించాము బాబాయ్ అంటూ మనోజ్ సైతం సమాధానం చెప్పారు. ఇలా వీరిద్దరి మధ్య సరదా సన్నివేశాలు సాగుతూ ఉండగా మనోజ్ సిద్దు సినిమాలకు సంబంధించిన కొన్ని లిప్ కిస్ సన్నివేశాలు ఫోటోలను ప్లే చేశారు. దీంతో సిద్దు జొన్నలగడ్డ ఒక్కసారిగా మొహం చాటేసారు. ఇదేంటి బాబాయ్ ఏ సినిమాలో చూసిన లిప్ కిస్ సన్నివేశాలు అయినా స్క్రిప్ట్ రెడీ చేసుకోవడానికి ముందు ముద్దు సీన్ తోనే మొదలు పెడతావ్ అంట కదా అంటూ మనోజ్ అడిగారు.

అంతేకాకుండా సిద్దు స్క్రిప్ట్ స్టార్ట్ చేసే ముందు రాసే పదం కిస్ అంటూ (Manchu Manoj) మనోజ్ సిద్దు పరువు మొత్తం తీసేసారు. ఇక ఈ ప్రోమోలో ఒక లేడీ అభిమాని సిద్దు జొన్నలగడ్డను ప్రశ్నిస్తూ ఇప్పటివరకు మీకు ఎంతమంది ప్రపోజ్ చేశారు అని అడిగారు. ఈ ప్రశ్నకు ఇప్పటివరకు తనకి ఎవరు ప్రపోజ్ చేయలేదని ఈయన సమాధానం చెప్పారు. అనంతరం కొన్ని గేమ్స్ కూడా మనోజ్ ఆడించారు. ఇక ఈ సెకండ్ ఎపిసోడ్ డిసెంబర్ 21వ తేదీ ప్రసారం కానుంది.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus