Manisharma: గుడుంబా శంకర్ మ్యూజిక్ హిట్ అవ్వడానికి పవన్ కారణం!

Advertisement

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ కేవలం హీరోగా మాత్రమే కాకుండా తాను నటించే సినిమాల డైరెక్షన్ విషయంలోను స్క్రీన్ ప్లే విషయంలోనూ మ్యూజిక్ విషయంలో కూడా కాస్త ఇన్వాల్వ్ అవుతారనే విషయం మనకు తెలిసిందే. ఇలా తన సినిమాల విషయంలో పవన్ కళ్యాణ్ అన్ని రంగాలలోనూ కాస్త ఇంట్రెస్ట్ చూపుతూ ఆ వ్యవహారాలన్నింటిని చూసుకుంటూ ఉంటారట. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గుడుంబా శంకర్ సినిమా సంగీతం విషయంలో కూడా ఈయన కాస్త చొరవ తీసుకున్నారనే తెలుస్తుంది.

ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ ఈ సినిమా గురించి,పవన్ కళ్యాణ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు. ఈ సందర్భంగా మణిశర్మ మాట్లాడుతూ తన కెరియర్ లో ఏదైనా బెస్ట్ ఆల్బమ్ ఉందంటే అది కేవలం గుడుంబా శంకర్ సినిమా మాత్రమేనని తెలియజేశారు.ఈ సినిమాకి ఇచ్చినన్ని జానర్స్ మరే సినిమాకి ఇవ్వలేదని తెలియజేశారు. ఇక ఈ సినిమా మ్యూజిక్ విషయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారని నిజం చెప్పాలంటే ఈ సినిమా మ్యూజిక్ క్రెడిట్ మొత్తం పవన్ కళ్యాణ్ కి చెందుతుందని మణిశర్మ వెల్లడించారు.

ఈ సినిమాకు (Manisharma) మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తనది అయిన పవన్ చాలా కష్టపడ్డారని ఈయన తెలిపారు.పవన్ కళ్యాణ్ రాత్రి పగలు అనే తేడా లేకుండా తన రికార్డింగ్ రూమ్ లో ఉంటూ ప్రతి చిన్న డీటెయిలింగ్ అడిగి తెలుసుకుని మరి తన ఇష్టానికి అనుగుణంగా మ్యూజిక్ కంపోజ్ చేయించుకునే వారని తెలిపారు. అందుకే ఈ సినిమా క్రెడిట్ మొత్తం పవన్ కళ్యాణ్ కు మాత్రమే ఇస్తానంటూ మణిశర్మ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇక మణిశర్మ సినిమాల విషయానికి వస్తే ఈయన గత ఏడాది మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ హీరోలుగా కొరటాల శివ దర్శకత్వంలో నటించిన ఆచార్య సినిమాకు సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. ఇక పవన్ కళ్యాణ్ మాత్రం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news