Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

‘మా ఇంటి బంగారం’ సినిమా ఇప్పుడు థియేటర్లలో సందడి చేస్తోంది. అంటే సమంత మరోసారి వెండితెరపై అలరిస్తోంది. ఇందులో ఆశ్చర్యపోయే విషయం ఏమీ లేదు. అయితే ఆమెతోపాటు మరో ఇద్దరు ఈ సినిమా కారణంగా వైరల్‌ అవుతున్నారు. అందులో ఒకరు ఇప్పటికే టీవీల్లో స్టార్‌గా ఉండి.. సినిమాల్లో కొన్ని చిన్న పాత్రలు వేయగా.. మరొకరు సోషల్‌ మీడియాలో బాగా ఫేమస్‌. వాళ్లెవరు.. ఎందుకు ఫేమస్‌ అయ్యారు. ఇప్పుడు వైరల్‌ అవుతున్నారో చూద్దాం.

Manjusha and Sreemukhi

పైన అంత ఎలివేషన్‌ ఇచ్చిన ఇద్దరు నటీమణులు ఎవరు అనుకుంటున్నారా? ఒక టీవీ స్టార్‌ యాంకర్‌ శ్రీముఖి. రెండోది మంజూష ముక్కవిల్లి. ముందుగా మంజూష గురించి చూద్దాం. ఈ సినిమాలో సమంత స్నేహితురాలి పాత్రలో నటించింది. ప్లలెటూరి ఉమ్మడి కుటుంబంలోకి కొత్తగా అడుగు పెట్టిన తన స్నేహితురాలికి వంట చేయడంలో సాయం చేయడానికి.. భర్తను విడిచిపెట్టి ఫ్రెండ్‌ ఊరెళ్లి మరీ హెల్ప్‌ చేసే పాత్ర ఆమెది. ఆమె నటనకు మంచి స్పందన వస్తోంది.

ఇక సినిమాలో సమంత తోడి కోడలిగా హోమ్లీ గెటప్‌లో అసూయ, అమాయకత్వం కలగలిపిన పాత్రలో నటించి మెప్పించింది శ్రీముఖి. టీవీలో అరుపులు, కేకలతో లౌడ్‌గా కనిపించే శ్రీముఖి సినిమాలో సెటిల్డ్‌ నటించి వావ్‌ అనిపించింది. టీవీల్లో, సోషల్‌ మీడియాలో ఎప్పుడూ ఫ్యాషనబుల్‌గా కనిపించే శ్రీముఖిని ఇలా నిండుగా కట్టుబొట్టులో చూసి మురిసిపోయారు ఆమె ఫ్యాన్స్‌. అన్నట్లు మంజూష బ్యాగ్రౌండ్‌ చెప్పలేదు కదా.. ఆమె సోషల్‌ మీడియాలో చాలా ఫేమస్‌.

మంజూష ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ చూస్తే ఆమె ఎంత టాలెంటెడ్‌ అనేది తెలుస్తుంది. దిగ్గజ నటి సూర్యకాంతం వీడియోలను రీల్స్‌గా చేస్తూ.. ఆమెలానే ఆహార్యం, నటనతో ఆ వీడియోల్లో మంజూష అదరగొడుతూ ఉంటుంది. ఆ రీల్స్‌లో చూసే ఆమెను డైరక్టర్‌ నందిని రెడ్డి సినిమాల్లో తీసుకున్నారట. ఈ సినిమాలో ఇద్దరికీ మంచి పేరొచ్చిన నేపథ్యంలో క్యారెక్టర్‌ ఆర్టిస్టుల కొరత కాస్త తీరినట్లే అని చెబుతున్నారు. చూద్దాం వీరి కోసం పాత్రలు రాసే దర్శక రచయితలు ఎవరున్నారో?

నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus