మిడిల్‌ క్లాస్‌ అబ్బాయ్‌ రెండు రోజుల కలక్షన్స్!

  • December 23, 2017 / 08:22 AM IST

వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో నేచురల్‌ స్టార్‌ నాని నటించిన మిడిల్‌ క్లాస్‌ అబ్బాయ్‌ చిత్రం గురువారం రిలీజ్ అయి మంచి స్పందన అందుకుంది. ఇదివరకు నాని సినిమాలు ఏదీ సాదించనటువంటి వసూళ్లు రాబట్టి ఆశ్చర్య పరిచింది. మిడిల్ క్లాస్ అబ్బాయి ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజున బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 7 కోట్ల షేర్ ను వసూలు చేసింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మించిన ఈ చిత్రం రెండు రోజుల్లో 10 కోట్లకు పైనే షేర్ రాబట్టింది. నాని, సాయి పల్లవి, భూమిక మధ్య సాగే సన్నివేశాలు కుటంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ జోరు ఇలాగే కొనసాగితే నానికి ఇది బిగ్గెస్ట్ హిట్ గా నిలవనుంది. ఏరియాల వారీగా MCA కలక్షన్స్..

నైజాం : 4.54 కోట్లు
సీడెడ్ : 1.56 కోట్లు
ఉత్తరాంధ్ర :1.37 కోట్లు
గుంటూరు : 0.86 కోట్లు
ఈస్ట్ : 0.83 కోట్లు
వెస్ట్ : 0.65 కోట్లు
కృష్ణ : 0.66 కోట్లు
నెల్లూరు : 0.34 కోట్లు
మొత్తం : 10.81 కోట్లు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus