Meena : తనపై వస్తున్న రూమర్లపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన నటి మీనా.. ఏమన్నారంటే..?

తనపై వస్తున్న అనవసర రూమర్లకు ఈసారి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు సీనియర్ హీరోయిన్ మీనా. చాలా కాలం పాటు దక్షిణ భారత సినీ పరిశ్రమలో అగ్ర కథానాయికగా వెలుగొందిన మీనా, తాజాగా సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న తప్పుడు కథనాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే మీనా, ఈసారి మాత్రం తన సహనాన్ని పరీక్షిస్తున్నారని స్పష్టంగా చెప్పుకొచ్చారు.

Meena

చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి, ఆపై హీరోయిన్‌గా స్టార్ స్టేటస్ అందుకున్న మీనా. సీతారామయ్య గారి మనవరాలు, చంటి, అబ్బాయిగారు, అల్లరి అల్లుడు, ముత్తు వంటి చిత్రాలతో ప్రేక్షకుల మనసుల్లో శాశ్వత స్థానం సంపాదించారు. ఇప్పటికీ క్యారెక్టర్ రోల్స్, కీలక పాత్రలతో తన సెకండ్ ఇన్నింగ్స్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు.

అయితే ఇటీవల మీనా రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వస్తున్న కథనాలు ఆమెను తీవ్రంగా కలచివేశాయట. వ్యక్తిగత జీవితంలో ఇప్పటికే పెద్ద విషాదాన్ని ఎదుర్కొన్న మీనా, మళ్లీ ఇలాంటి అసత్య ప్రచారాలు తనను మానసికంగా బాధిస్తున్నాయని తెలిపారు. “నిజం ఏంటో తెలుసుకోకుండా, మీ ఇష్టం వచ్చినట్లు కథలు అల్లడం ఎంతవరకు కరెక్ట్ ?” అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఒక ఒంటరి మహిళనని, అంతేకాదు ఒక కుమార్తె తల్లినని గుర్తుచేశారు. ఈ వార్తలు తన కూతురు చూసినప్పుడు ఆమె మనసుపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఆలోచించాలంటూ మీడియా, సోషల్ మీడియాను కోరారు.

ఇలాంటి రూమర్లకు స్పందించి తన సమయం, ఆరోగ్యం, ఎనర్జీని వృథా చేసుకోవాలని తనకు లేదని, పాజిటివ్‌గా జీవించడమే తన లక్ష్యమని మీనా స్పష్టం చేశారు. “కర్మ అనేది ఉంటుంది అని అది ఎవరినీ వదిలిపెట్టదు” అనే ఆమె మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మొత్తానికి ఎప్పుడూ సైలెంట్‌గా ఉండే మీనా ఇలా ఫైర్ అవ్వటం చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇకనైనా ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఆగిపోవాలని ఆమె స్పష్టమైన హెచ్చరిక ఇచ్చినట్టే భావించాలి.

Kalyan Ram : బింబిసార 2 ఇప్పట్లో లేనట్టేనా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus