Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

నాని హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ‘బ్లడీ రోమియో’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా గురించి ఇప్పటికే పెద్ద ఎత్తున వార్తలు రావాల్సి ఉన్నా.. వివిధ కారణాల వల్ల ఆ సినిమా అప్‌డేట్స్‌ రాకుండా ఆగిపోయాయి. ఇప్పుడు ‘ప్యారడైజ్‌’ సినిమా ఫలితం కారణంగా ఈ సినిమా ఇంకొంత ఆలస్యం అవుతుంది అనే వార్తలు వస్తున్న ఈ సమయంలో ఓ వార్త బయటకు వచ్చింది. అదే సినిమాలో జూలియట్‌గా కనిపించబోయేది ఎవరో తేలిపోయింది.

Meenakshi Chaudhary

‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’ అనేలా ఉన్న పరిస్థితుల్లో దర్శకుడు సుజీత్‌ నాని సినిమాకే ఓటేశారు. ఈ సినిమా మ్యాగ్జిమమ్‌ విదేశాల్లో చిత్రీకరణ జరుపుకుంటుంది అని కూడా చెబుతున్నారు. ‘ప్యారడైజ్‌’ స్ట్రోక్‌ నుండి నాని బయటపడ్డాక ఈ సినిమా షూటింగ్‌ మొదలుపెడతారట. తక్కువ షెడ్యూల్స్‌లోనే సినిమాను పూర్తి చేసేద్దాం అనుకుంటున్నారట. తొలి షెడ్యూల్‌ను లండన్‌లో షూట్‌ చేస్తారట. అందులో మెయిన్‌ సీన్స్‌ అన్నీ అయిపోతాయట.

మీనాక్షి చౌదరి గతంలో నానితో కలసి పని చేసింది. అయితే అది హీరో – హీరోయిన్‌గా కాదు.. హీరోయిన్‌ – నిర్మాతగా. నాని నిర్మాణంలో రూపొందిన ‘హిట్‌ 2’ సినిమాలో అడివి శేష్‌కి జోడీగా మీనాక్షి నటించింది. ఇప్పుడు అన్నీ కుదిరితే నానితో కలసి నటించబోతోంది. ఈ సినిమాలో నాని ‘రోమియో’ కాబట్టి.. మీనాక్షి ‘జూలియెట్‌’ అవుతుంది. మరి నిజంగానే అదే పేరు పెడతారా? లేక వేరే ఏదైనా పేరు పెడతారా అనేది చూడాలి.

ఏటా సంక్రాంతికి వస్తున్న మీనాక్షి ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘అనగనగా ఒక రాజు’ అంటూ వరుస పండగలకు వరుస విజయాలు అందుకుంది. ఇప్పుడు నాగచైతన్యతో ‘వృషకర్మ’ అనే సినిమా చేస్తోంది. ఈ సినిమా డిసెంబరులో రాబోతోంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్, యునానిమస్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను 2027 వేసవి కానుకగా విడుదల చేస్తారని సమాచారం. అయితే సినిమా షూటింగ్‌ మొదలయ్యే బట్టి ఈ డేట్‌ ఆధారపడి ఉంటుంది..

ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus