Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

‘జైలర్‌’ సినిమా సాధించిన రూ.600 కోట్ల విజయం కారణమో.. లేక మరే కారణమో కానీ సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ నాగవంశీ ‘జైలర్‌ 2’ సినిమాను భారీ డబ్బు పెట్టి తీసుకున్నారు. కొంతమంది ఈ డీల్‌ రూ.45 కోట్లు అంటుంటే.. ఆ సినిమా హైప్‌ను పెంచాలి అనుకుంటున్న వారు రూ.90 కోట్లు అని అంటున్నారు. ఆ డబ్బు లెక్క మనకు తెలియదు కానీ.. ఇప్పుడు మరో లెక్క బయటకు వచ్చింది. అదే ప్రచారం లెక్క. ఈ సినిమా ప్రమోషన్స్‌ స్ట్రాటజీని చిత్రబృందం విడుదల చేసింది. ఎప్పుడు, ఎలాంటి ప్రచారం చేస్తామో చెప్పకనే చెప్పింది.

Jailer 2

* సెప్టెంబరు 29న ‘వన్‌ నేమ్‌..’ పాట లిరికల్‌ వీడియోను రిలీజ్‌ చేస్తారు. * సెప్టెంబరు 30న నాలుగో పట మ్యూజిక్‌ వీడియోను ఆవిష్కరిస్తారు. * అదే రోజున ‘జైలర్‌ 2 రేవ్‌’ అనే పేరుతో సినిమా మ్యూజిక్‌ ఆల్బర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. * సెప్టెంబరు 30నే ఫుల్‌ ఆల్బమ్‌ లాంచ్‌ ఈవెంట్‌ ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ చేస్తారు * అక్టోబరు 3న సన్‌ నెక్స్ట్‌లో ఆడియో లాంచ్‌ ఈవెంట్‌ స్ట్రీమింగ్‌ చేస్తారు * అక్టోబరు 4న సన్‌ టీవీలో మ్యూజిక్‌ లాంచ్‌ ఈవెంట్‌ని టెలీకాస్ట్ చేస్తారు. * అక్టోబరు 5న సినిమా ట్రైలర్‌ను లాంచ్‌ చేస్తారు.

ఇలా సన్‌ పిక్చర్స్‌ టీమ్‌ మొత్తంగా సెప్టెంబరు 29 నుండి అక్టోబరు 4 వరకు వరుస ఈవెంట్లు ప్లాన్‌ చేసింది. ఇందులో ఎక్కడా తెలుగు సినిమా ప్రచారానికి సంబంధించిన అంశాలు లేవు. మరి వాటిని నాగవంశీ ప్లాన్‌ చేస్తారో లేక సన్‌ వాళ్లే చూస్తారో తెలియదు. నాగవంశీ చూసుకునేటట్లయితే వీకెండ్‌లోనే పెడతారు. కాబట్టి 10, 11 తేదీల్లో ప్రీరిలీజ్‌ ఈవెంట్ హైదరాబాద్‌లో ఉండొచ్చు. ఒకవేళ ఉంటే గెస్ట్‌గా ఎవరొస్తారు అనేది కూడా చూడాలి.

నాగవంశీ పిలవాలి అనుకుంటే ఎన్టీఆర్‌ పేరే ముందు వినిపిస్తుంది. ఒకవేళ ఎన్టీఆర్‌ వస్తే ఏం మాట్లాడతారు అనేది కూడా ఆసక్తికరమే. ఎన్టీఆర్‌ ఎందుకు అంటే.. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ – ఎన్టీఆర్‌ కాంబోలో సినిమా ఉంది అనేది చాలా రోజుల నుండి వినిపిస్తున్న మాట. ఈ స్టేజీ మీద ఆ మాట విషయంలో క్లారిటీ వచ్చేస్తుంది. ఒకవేళ ఎన్టీఆర్‌కి కుదరకపోతే త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో ప్రోగ్రామ్‌ను హ్యాండిల్ చేయిస్తారు.

‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus