పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూడో మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ వేగంగా జరుగుతోంది. త్రివిక్రమ్ ఆర్టిస్టులు, టేక్నీషియన్ల ఎంపిక పూర్తి చేశారు. కొన్ని రోజుల క్రితం సంగీత దర్శకుడుగా అనిరుద్ ని ఫిక్స్ చేయగా, కెమెరామెన్ గా ప్రముఖ ఫోటో గ్రాఫర్ పీసీ శ్రీరామ్ ని ఖరారు చేశారు. హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించే ఈ చిత్రంలో కథానాయికలుగా నేను శైలజ ఫేమ్ కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయెల్ ని తీసుకున్నారు. ఇందులో ఓ కీలక రోల్లో కన్నడ స్టార్ హీరో ఉపేంద్రను హైర్ చేసుకోనున్నట్లు వార్తలు వచ్చాయి.
తాజాగా అందిన సమాచారం ప్రకారం ఆ ప్లేస్ లో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ వచ్చినట్లు తెలిసింది. ‘జనతా గ్యారేజ్’ లో ఆయన తన నటనతో తెలుగు ప్రేక్షకులకు మెప్పించారు. మన్యం పులి తో మరింత దగ్గరయ్యారు. అందుకే ఈ సినిమాకు మోహన్ లాల్ ప్లస్ అవుతారని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో “కాటమరాయుడు” చిత్రీకరణలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్, దీనిని సాధ్యమైనంత వేగంగా పూర్తి చేసి త్రివిక్రమ్ సినిమాను పట్టాలెకెక్కించనున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.