బిగ్ బాస్ 4: 14 వారాల బిగ్ బాస్ జెర్నీ ముగించిన గుజరాతీ భామ..!

  • December 12, 2020 / 10:03 PM IST

బిగ్ బాస్ హౌస్ లో హీరోయిన్ మోనాల్ జెర్నీ ఎట్టకేలకి ముగిసినట్లుగా సమాచారం తెలుస్తోంది. 14వ వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ గా మోనాల్ హౌస్ నుంచి బయటకి వచ్చినట్లుగా సమాచారం. సుడిగాడు, పున్నమిరాత్రి, బ్రదర్ ఆఫ్ బొమ్మలి లాంటి సినిమాల్లో నటించిన మోనాల్ గజ్జర్ బిగ్ బాస్ హౌస్ లోకి మొదటి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగు సరిగ్గా రాకపోయినా పట్టుదలగా నేర్చుకుని మరీ 14వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో తనని తాను నిరూపించుకునే ప్రయత్నం చేసింది.

ఎంతో మంది హౌస్ మేట్స్ ఎలిమినేట్ అవుతున్నా కూడా తను మాత్రం తన గేమ్ పైన ఫోకస్ పెడుతూ ఏడుపే తన ఆయుధంగా ఇన్ని వారాలు నెట్టుకొచ్చింది. బిగ్ బాస్ హౌస్ లో అభిజిత్, అఖిల్ తో ట్రయాంగిల్ లవ్ స్టోరీలాగా మనకి మోనాల్ ని చూపించినా, ఎప్పుడూ ఏడుస్తున్నట్లుగానే కనిపించినా ఇన్ని వారాలపాటు హౌస్ లో ఉంది అంటే ఖచ్చితంగా అభినందిచాల్సిన విషయమే అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

గుజరాతీ భామని ఇన్నివారాలు సేఫ్ చేసిన ప్రజలు ఎట్టకేలకి ఈవారం ఎలిమినేట్ చేసి టాప్ – 5 లో లేకుండా చేశారు. బిగ్ బాస్ హౌస్ లో నెట్టుకొచ్చిన ఈ భామ ఆఫ్టర్ బిగ్ బాస్ తన గ్రాఫ్ ఎలా మార్చుకుంటుంది అనేది చూడాలి.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus