Kamal – Rajini: ఓటీటీ రైట్స్‌.. కమల్‌ సినిమా కంటే రజనీ సినిమాకే ఎక్కువ డబ్బులు

ప్రముఖ కథానాయకుడు కమల్‌ హాసన్‌ నిర్మిస్తున్న మూడు సినిమాల గురించి గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున వార్తలొస్తున్నాయి. దానికి కారణం ఆ మూడు సినిమాలను గంపగుత్తగా ఒక ఓటీటీకే ఇచ్చేయడం. అందులోనూ భారీ మొత్తాలకే ఆ సినిమాలు ఇవ్వడమే ఈ చర్చలకు కారణం. కమల్‌ హాసన్‌ సొంత బ్యానర్‌ రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ మీద ప్రస్తుతం రజనీకాంత్‌ సినిమా, కమల్‌ సొంత సినిమా, శివకార్తికేయన్‌ ప్రాజెక్ట్‌ రూపొందుతున్న విషయం తెలిసిందే.

Kamal -Rajini

మూడు సినిమాల ఓటీటీ రైట్స్‌, తమిళ టీవీ హక్కులను కమల్‌ హాసన్‌ డీట్‌ సెట్‌ చేసి ఓకే చేశారట. జియో హాట్‌ స్టార్‌, విజయ్‌ టీవీతో ఈ డీల్‌ సెట్‌ అయింది అని చెబుతున్నారు. దీని కోసం వారు రూ.350 కోట్ల నుంచి రూ. 400 కోట్ల వరకు ఇస్తున్నారు అని సమాచారం. అయితే ఈ డీల్‌లో కమల్‌ సినిమాకు ఇస్తున్న మొత్తం కంటే రజనీకాంత్‌ సినిమాకు వస్తున్న మొత్తం ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇక శివకార్తికేయన్‌ సినిమాకు అయితే రజనీ సినిమాలో సగం ఇస్తున్నారు.

రజనీకాంత్‌ – అశ్వత్‌ మరిముత్తు కాంబినేషన్‌లో కమల్‌ నిర్మిస్తున్న ‘ధర్మన్‌’ సినిమాకు రూ. 150 కోట్ల వరకు ఇస్తున్నారట. ఇక ఎస్‌ఏ అరుణ్‌ కుమార్‌తో కమల్‌ చేస్తున్న సినిమాను రూ.125 కోట్లకు ఓకే చేశారట. ఇక శివకార్తికేయన్‌ ‘సెయాన్‌’ సినిమాకు రూ.75 కోట్లు ఇవ్వడానికి జియో హాట్‌స్టార్‌ – విజయ్‌ టీవీ ఓకే అయ్యాయట. అయితే ఈ ధరల సెట్‌ ఫైనల్‌గా సినిమా వచ్చేసరికి కాస్త మారొచ్చు అని చెబుతున్నారు.

ఇక సంగీతం హక్కలను సరిగమ తీసుకుందట. దీని కోసం భారీ మొత్తంలోనే డబ్బులు అందుకోబోతున్నారట కమల్‌. సినిమాల రిలీజ్‌ ఎప్పుడు అనేది తెలియకుండానే ఇంత మొత్తంలో డీల్‌ అంటే గ్రేట్‌ అనే చెప్పాలి. రజనీ సినిమా సంక్రాంతికి, కమల్‌ సినిమా సమ్మర్‌లో, ‘సెయాన్‌’ ఇప్పటికే వచ్చేయాలి కానీ లేట్‌ అయింది.

కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus