Mrunal Thakur: రిజెక్షన్స్‌.. అప్‌ అండ్‌ డౌన్స్‌.. మృణాల్‌ ఠాకూర్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రజలకు సీతగా పరిచయమైంది మృణాల్‌ ఠాకూర్‌. నిజానికి అక్కడికి ఎనిమిదేళ్ల క్రితమే ఆమె సినిమా కెరీర్‌ ప్రారంభమైంది. మరాఠీ సినిమాలు, హిందీ సినిమాలు చేస్తూ మంచి నటిగా పేరు తెచ్చుకుంది. అయితే ఆమె కెరీర్‌ ఎర్లీ డేస్‌ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. అలానే మనకు కూడా తెలియదు. ఇటీవల ఓ మీడియాతో మాట్లాడుతూ తన తొలి రోజుల గురించి చెప్పుకొచ్చింది. మన కుర్ర హీరోలు చెబుతుంటారే రిజెక్షన్స్‌, అప్‌ అండ్‌ డౌన్స్‌ అని.. అలానే చాలానే చెప్పింది.

Mrunal Thakur

తన కెరీర్‌ ప్రారంభం గురించి మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ బాలీవుడ్ మీద కొన్ని వైరల్‌ కామెంట్స్ చేసింది. బాలీవుడ్‌లో పెద్ద సినిమాల్లో భాగం అవుతున్నాను అని అనుకున్న సమయంలో సినిమా నుండి తనను పక్కన పెట్టేశారు అని చెప్పింది. అప్పట్లో నా హిందీ స్పష్టంగా లేదన్నారు. ఎందుకంటే నేను మహారాష్ట్ర కుటుంబం నుండి వచ్చాను. అయితే ప్రేమ్ చంద్ కథలు చదివాను. హిందీ షోలు చూశాను. వార్తాపత్రికలు చదివాను. ఆ తర్వాత పర్‌ఫెక్ట్‌ అవుతూ వచ్చాను అని చెప్పింది మృణాల్‌.

ఇప్పుడు తెలుగు,తమిళ, మలయాళ సినిమాలను చూస్తున్నానని చెప్పింది మృణాల్‌. ఆరేళ్ల క్రితం నేను, ఇప్పటి నేను చూసుకుంటే ఈ ఇంత ప్రయాణం చేశానా అనిపిస్తోంది. వెనక్కి తిరిగి చూస్తే జీవితంలో అప్స్‌ అండ్ డౌన్స్‌ కనిపిస్తున్నాయి అని చెప్పుకొచ్చింది. అయితే ఏ సినిమాల నుండి తప్పించారు. ఏవి మిస్‌ అయ్యాయి అనేది చెప్పలేదు. ఇక ప్రస్తుతం మృణాల్‌ కెరీర్‌ చూస్తే.. హిందీ, తెలుగు సినిమాలతో బిజీగా ఉంది.

హిందీలో ‘దో దీవానే సెహర్‌ మే’, ‘హై జవానీ తో ఇష్క్‌ హోనా హై’ చేస్తోంది. ఇక తెలుగులో అడివి శేష్‌ ‘డెకాయిట్‌’, అల్లు అర్జున్‌ – అట్లీ సినిమాల్లో నటిస్తోంది. ‘డెకాయిట్‌’ సినిమా సమ్మర్‌లో రానుండగా.. బన్నీ సినిమా వచ్చే ఏడాది రిలీజ్‌ చేస్తారు.

అపోలో దగ్గర తోపులాట.. తప్పెవరిది? మెగా ఫ్యామిలీదా? ఫ్యాన్స్‌దా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus