Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

సినిమా వాళ్ళ ప్రేమ,పెళ్లి, బ్రేకప్, విడాకులు వంటి విషయాలపై సహజంగానే ఆడియన్స్ కి ఎక్కువ ఆసక్తి ఉంటుంది. అలాంటి స్పైసీ న్యూస్..లు చదివేందుకు ఆడియన్స్ కూడా ముందుంటారు అనే చెప్పాలి. అందుకే సినిమా వాళ్ళు పాల్గొనే ఇంటర్వ్యూల్లో ఈ విషయాలపై స్పెషల్ ఫోకస్ పెడుతుంటారు హోస్టులు లేదా యాంకర్స్. బాలీవుడ్లో ఇలాంటివి ఎక్కువ. చాప కింద నీరులా అది టాలీవుడ్ ని కూడా తాకింది.

Mrunal Thakur

అయితే కొంతమంది హీరోయిన్లు కూడా అటెన్షన్ కోసం ఈ వ్యవహారాలపై ప్రస్తావించేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. వాళ్ళు నిజ జీవితంలో బ్రేకప్ వంటి వ్యవరాలు ఎదుర్కొన్నా లేకపోయినా.. కొంచెం ఎక్కువగా జోడించి మాట్లాడుతూ ఉంటారు.తాజాగా మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) కూడా తన ప్రేమ, బ్రేకప్ కహానీ గురించి చెప్పి షాకిచ్చింది. ధనుష్ తో పెళ్లి అంటూ ఈ మధ్య ఎక్కువగా హాట్ టాపిక్ అయిన ఈమె.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.

అందులో భాగంగా… మృణాల్ ఠాకూర్ తన పాస్ట్ లవ్ గురించి మాట్లాడుతూ… “నేను నటిని కావడం వల్లే… నా మాజీ బాయ్‌ఫ్రెండ్ నాకు బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోయాడు.’నువ్వు చాలా ఇంపల్సివ్‌. నిన్ను హ్యాండిల్ చేయడం కష్టం. పైగా నువ్వు హీరోయిన్‌వి. నువ్వు సినిమాల్లో నటించడం నాకు అస్సలు నచ్చదు’ అంటూ నన్ను వదిలుంచుకున్నాడు. ఆ బంధం ముగిసిపోవడం నా మంచికే అని అనుకుంటాను.

లేదు అంటే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు వచ్చేవేమో’ అంటూ చెప్పుకొచ్చింది.మృణాల్ నటించిన ‘దో దీవానె సహర్ మేన్’ సినిమా ఫిబ్రవరి 20న విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే ఆమె ఇలా చెప్పుకొచ్చింది.

మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus