మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) కొంతకాలంగా వార్తల్లో నిలుస్తుంది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో ఈమె చాలా కాలంగా ప్రేమలో ఉందని, ప్రస్తుతం వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారని.. ఓ రేంజ్లో రూమర్స్ వచ్చాయి. వాస్తవానికి ధనుష్ కానీ, మృణాల్ కానీ వెంటనే వీటిపై స్పందించి క్లారీటీ ఇచ్చింది లేదు. మరోపక్క వీళ్ళు కలిసి నటించింది కూడా లేదు. ఒకానొక సందర్భంలో మాత్రం కలిశారు. ఆ టైమ్లో తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.వెంటనే బాలీవుడ్ మీడియా వీరి గురించి కథనాలు రాసుకొచ్చింది.
కొద్దిరోజుల పాటు ఈ రూమర్స్ గట్టిగా సర్క్యులేట్ అయ్యాయి. తర్వాత జనాలు కూడా లైట్ తీసుకున్నారు. సెలబ్రిటీల పై ఇలాంటి రూమర్స్ సర్వసాధారణం అని అంతా సరిపెట్టుకున్నారు. అయితే సడన్ గా ఫిబ్రవరి 14న వీళ్ళు పెళ్ళి చేసుకోబోతున్నట్టు మరో వార్త బయటకు వచ్చింది. కొన్ని రోజులుగా ఈ వార్త కూడా ఓ రేంజ్లో వైరల్ అవుతుంది. ఈ నేపధ్యంలో ఓ ఇంటర్వ్యూలో మృణాల్ స్పందించి క్లారీటీ ఇవ్వాల్సి వచ్చింది.
మృణాల్ ఠాకూర్ ఈ విషయం పై స్పందిస్తూ.. “ఆ పెళ్లికి నన్ను ఎవరూ పిలవలేదు. ఆ వార్తలు చూసి నేను చాలా నవ్వుకుంటున్నాను. అయితే ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తున్న వాళ్లందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎంధుకంటే.. వాళ్ళంతా నాకు ఫ్రీగా పీఆర్ చేసి పెడుతున్నారు.ఫైనల్ గా నేను చెప్పాలనుకుంటున్నదేంటంటే… మీరు అనుకునేది ఏదీ నిజం కాదు.
ఫిబ్రవరి 14న మీరే చూస్తారు కదా. నేను పెళ్లి చేసుకునే టైమ్ వస్తే… లేదా నాకు పెళ్ళి ఫిక్స్ అయితే, ఆ వార్తను ముందుగా శ్రీ గణేశుడితో పాటు అభిమానులతో తప్పకుండా పంచుకుంటాను” అంటూ చెప్పుకొచ్చింది.