‘విక్రమార్కుడు’ సినిమాలో ఒక సన్నివేశం ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్లో విక్రమ్ రాథోడ్ ని అవమానించడానికి విలన్ ఒక పార్టీ ఏర్పాటు చేస్తాడు. అక్కడ విలన్ కొడుకు ఒక పోలీస్ తో బట్టలు విప్పిస్తాడు. తర్వాత విక్రమ్ రాథోడ్ ని టార్గెట్ చేసినప్పుడు.. అతను మైండ్ గేమ్ ఆడి బుల్లెట్ల సాయంతో విలన్ కొడుకు మేడ మీద నుండి కింద పడిపోయి చనిపోయేట్టు చేస్తాడు.
ఈ సీన్ ‘విక్రమార్కుడు’ సినిమా హైలెట్స్ లో ఒకటి. సోషల్ మీడియాలో లేని రోజుల్లో ఈ సీన్ ని తెగ పొగిడేశారు జనాలు. రాజమౌళిని కూడా ఆకాశానికెత్తెశారు. కానీ కొంత కాలం తర్వాత సోషల్ మీడియా వాడకం మొదలైంది. అప్పుడు సేమ్ సీన్ వేరే సినిమాలో చూసి షాక్ అయ్యారు. అవును అదే సీన్ విజయశాంతి నటించిన ‘శాంభవి ఐపీఎస్’ అనే సినిమాలో ఉంటుంది. డైలాగులు కూడా ఆల్మోస్ట్ సేమ్.
దీంతో నెటిజెన్లు రాజమౌళి, రైటర్ విజయేంద్రప్రసాద్..లని కాపీ క్యాట్ అంటూ ట్రోల్ చేశారు. ఇప్పటికీ ‘విక్రమార్కుడు’ సినిమాలో ఆ సీన్ చూస్తే.. అది అలరించే విధంగా ఉన్నప్పటికీ కొంతమంది ఆడియన్స్ కి ఆ ట్రోలింగ్ గుర్తుకొచ్చి.. ఆ సీన్ గురించి తక్కువ చేసి మాట్లాడుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఆ సీన్ గురించి విజయేంద్రప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో క్లారీటీ ఇవ్వడం జరిగింది.
విజయేంద్రప్రసాద్(Vijayendra Prasad) మాట్లాడుతూ.. ” ‘విక్రమార్కుడు’ సినిమాలో విలన్ కొడుకుని పోలీస్ యూనిఫార్మ్ తో చంపే సీన్ ఎడైతే ఉందో..అది ఒరిజినల్ కాదు అన్నది నిజం. ‘శాంభవి ఐ పీ ఎస్’ సినిమాలోని సీన్ నే ‘విక్రమార్కుడు’ లో పెట్టాము. వాస్తవానికి ‘శాంభవి ఐ పీ ఎస్’ కి కూడా నేనే రైటర్ ని. ఆ కథ రాసింది నేనే. అయితే ‘శాంభవి ఐ పీ ఎస్’ సినిమా ఆడలేదు కాబట్టి.. ‘ఆ సీన్ ని వాడుకుంటాం అని నిర్మాతని అడిగాము.ఆయన ఒప్పుకున్న తర్వాతే ‘విక్రమార్కుడు’ లో పెట్టుకున్నాం” అంటూ చెప్పుకొచ్చారు.