స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన ‘వీర్’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నటి జరీనా ఖాన్. చూడడానికి అచ్చం బొద్దుగా ఉన్న కత్రినా కైఫ్ లా ఉండడంతో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది. అయితే ‘వీర్’ సినిమా ప్లాప్ అవ్వడంతో ఆమెకి సరైన అవకాశాలు రాలేదు. తెలుగులో ‘చాణక్య’ అనే సినిమాలో నటించింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్క సినిమా మాత్రమే ఉంది. ఇటీవల కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడిన జరీనా ఖాన్.. తాజాగా తన శరీరాకృతిపై ఎదుర్కొన్న విమర్శల గురించి చెప్పుకొచ్చింది.
ఇరవై ఏళ్లకే ఇండస్ట్రీకి వచ్చానని.. అయితే ఇప్పటితరం వారిలా అప్పట్లో తనకు అంత అవగాహన లేదని చెప్పింది. దీంతో ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపింది. ‘వీర్’ మూవీ షూటింగ్ సమయంలో అంతా కొత్తగా అనిపించేది.. సినిమాలు, షూటింగ్ లపై అవగాహన లేదని చెప్పింది. ఎంతో అనుభవం ఉన్న వ్యక్తులతో పని చేయడంతో.. ఎవరు ఎలాంటి సూచనలు చెప్పినా పాటించేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో ‘వీర్’ షూటింగ్ సమయంలో కొంతమంది తనను బరువు పెరగమని సలహా ఇచ్చినట్లు చెప్పింది.
వాళ్లు చెప్పినట్లుగానే బరువు పెరిగానని.. సినిమా విడుదలైన తరువాత తన శరీరాకృతిపై కామెంట్స్ వచ్చాయని చెప్పింది. అవి చూసి తట్టుకోలేకపోయాయని.. ఆ సమయంలో తన శరీర బరువు ఒక నేషనల్ ప్రాబ్లెమ్ గా మారిందని సెటైరికల్ గా చెప్పింది. ఇండస్ట్రీలో వారు.. బయట వారు అందరూ తన బరువు గురించే మాట్లాడుకునేవారని చెప్పుకొచ్చింది. తన బరువు కారణంగానే సినిమా ప్లాప్ అయిందనే కామెంట్స్ విని తట్టుకోలేకపోయానని.. కానీ ఒక నటికి ఇలాంటివి సాధారణమే అని గ్రహించి పట్టించుకోవడం మానేశానని చెప్పుకొచ్చింది.
Most Recommended Video
బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?