Nabha Natesh: ఇస్మార్ట్ బ్యూటీకి ఆ హీరో ఛాన్స్ ఇచ్చారా?

Advertisement

ఇస్మార్ట్ శంకర్ సినిమాలో రామ్ కు జోడీగా నటించి నభా నటేష్ మంచి పేరును సంపాదించుకున్నారు. ఇస్మార్ట్ శంకర్ కు ముందు పలు సినిమాల్లో నటించినా ఈ సినిమాతోనే నభా నటేష్ కు క్రేజ్ వచ్చింది. అయితే ఇస్మార్ట్ శంకర్ తర్వాత నభా నటేష్ నటించిన డిస్కో రాజా, అల్లుడు అదుర్స్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. అయితే గోపీచంద్ శ్రీవాస్ కాంబో ​సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీకి ఛాన్స్ దక్కినట్టు తెలుస్తోంది.

హీరోయిన్ల విషయంలో గోపీచంద్ లక్కీ హ్యాండ్ అని ఇండస్ట్రీలో టాక్ ఉంది. గోపీచంద్ తో నటించిన తరువాత రాశీఖన్నా, రకుల్ ప్రీత్ సింగ్, అనుష్కలకు స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కింది. ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ విషయంలో కూడా ఈ సెంటిమెంట్ నిజమవుతుందేమో చూడాల్సి ఉంది. నభా నటేష్ నటించిన మ్యాస్ట్రో సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కానుందని వార్తలు వస్తున్నాయి. వచ్చే నెల ఆగష్టు 15వ తేదీన మ్యాస్ట్రో రిలీజ్ కానుందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

ఈ మధ్య కాలంలో నితిన్ నటించిన సినిమాలు సక్సెస్ కావడం లేదు. చెక్, రంగ్ దే సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా కమర్షియల్ గా ఆ సినిమాలు సక్సెస్ సాధించలేదు. అయితే నభా గోపీచంద్ సినిమాలో నటిస్తున్నట్టు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. గోపీచంద్ కు రెండు సక్సెస్ లు ఇచ్చిన శ్రీవాస్ ఈ సినిమాతో మరో సక్సెస్ ను ఇస్తారేమో చూడాల్సి ఉంది.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus