Naga Chaitanya: అలాంటి కథతో రిస్క్ చేస్తున్న అక్కినేని హీరో.. సక్సెస్ సాధిస్తారా?

అక్కినేని హీరో నాగచైతన్య ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్నాయి. నాగచైతన్య సినిమాలు , బయ్యర్లకు భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చాయి. నాగచైతన్య నిజ జీవితంలో సమంతతో విడాకులు తీసుకోవడం ద్వారా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. చైసామ్ విడిపోయి చాలా రోజులైనా చైసామ్ విడాకుల గురించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే నాగచైతన్య విడాకులకు సంబంధించిన సినిమాలో నటించనున్నారని సమాచారం అందుతోంది.

సామజవరగమన సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకున్న దర్శకుడు రామ అబ్బరాజు డైరెక్షన్ లో చైతన్య తర్వాత సినిమా తెరకెక్కనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. విడాకుల నేపథ్యంలో చైతన్య నటిస్తుండటం కొంతమంది అక్కినేని అభిమానులకు మాత్రం ఇష్టం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ కు చైతన్య సూచనల ఆధారంగా దర్శకుడు రామ సుబ్బరాజు మార్పులు చేస్తున్నారని తెలుస్తోంది.

వరుసగా సినిమాలు అంచనాలను అందుకోకపోయినా నాగచైతన్య క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు. నాగచైతన్య ప్రాజెక్ట్ ల ఎంపికలో మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. చైతన్యకు రాబోయే రోజుల్లో భారీ విజయాలు దక్కాలని ఫ్యాన్స్ సైతం కోరుకుంటున్నారు. నాగచైతన్య జయాపజయాలతో సంబంధం లేకుండా డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తున్నారు. నాగార్జున, నాగచైతన్య కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

నాగచైతన్యను (Nag Chaitanya) అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. చరణ్, సామ్ కాంబినేషన్ లో భవిష్యత్తులో సినిమాలు వచ్చే ఛాన్స్ లేదని తెలుస్తోంది. నాగచైతన్య వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో వార్తలు ప్రచారంలోకి వస్తుండగా వైరల్ అవుతున్న వార్తల్లో నిజం లేదని సమాచారం. నాగచైతన్య ప్రస్తుతం కెరీర్ పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు. సినిమా సినిమాకు చైతన్యకు క్రేజ్ పెరుగుతోంది.

బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

హాస్టల్ డేస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
మహావీరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus