R Narayana Murthy: ఫైనల్‌గా మారిపోయిన ఆర్‌.నారాయణమూర్తి.. ఈ సినిమాలో అంత స్పెషలేంటి?

సినిమా పరిశ్రమలో ఓ నటుడిని కమర్షియల్‌ పాత్రలకు ఒప్పించడం సులువు అని ఓ లైన్‌ రాస్తే.. ఆఖరున ‘ఆర్‌.నారాయణమూర్తి’ ఆటోమేటిగ్గా వచ్చేస్తుంది. తన కెరీర్‌లో ఇన్నాళ్లూ ఒకే లైన్‌ మీద సినిమాలు చేస్తూ మెప్పిస్తూ వస్తున్నారాయన. మధ్యలో ఎంతమంది పెద్ద హీరోలు అడిగినా, ఎంత పెద్ద దర్శకులు అడిగినా తన పంథా మార్చుకోనని.. తన జోనర్‌లో, తన మనసుకు నచ్చిన సినిమాలు చేస్తూ వస్తున్నారు. అయితే తొలిసారిగా ఆయన తన పంథాను మార్చారు.

R Narayana Murthy

సమాజానికి సందేశాన్ని ఇచ్చే సినిమాఉ చేసి పీపుల్స్ స్టార్ అని పిలిపించుకున్న ఆయన ‘అర్ధరాత్రి స్వాతంత్ర్యం’, ‘ఆలోచించండి’, ‘అడవి దివిటీలు’, ‘ఎర్ర సైన్యం’, ‘చీమలదండు’, ‘ఎర్రోడు’, ‘ఒరేయ్ రిక్షా’, ‘అరణ్యం’ అంటూ వరుసగా ఒకే అంశం చుట్టూ తిరిగే సినిమాలు చేసిన ఆయన ఆఖరిగా ‘యూనివర్శిటీ’ అంటూ విద్యా వ్యవస్థ మీద ఓ సినిమా చేశారు. ఈ సినిమాలన్నీ ఆయన దర్శకత్వంలో ఆయన నటించినవే కావడం గమనార్హం.

ఇప్పుడు ‘హుషారు 2’ సినిమాలో స్పెషల్ క్యామియో చేశారు. ఈ సినిమాలో పీపుల్స్ స్టార్‌కు అడవిలో నక్సలైట్ పాత్ర ఇచ్చారు. అయితే సబ్జెక్టు పూర్తిగా వినోదం నేపథ్యంలోనే నడుస్తుందగ. ఆయనకు దర్శకుడు శ్రీహర్ష ఏం చెప్పి ఒప్పించారనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే గతంలో ‘టెంపర్‌’ సినిమాలో పోసాని కృష్ణ మురళి పోషించిన మూర్తి గారు పాత్రను తొలుత ఆఫర్‌ చేసింది ఆర్‌.నారాయణమూర్తికే. ఆయన అప్పుడు ఓకే చేయలేదు.

మొన్నీ మధ్య ‘కామ్రేడ్ కల్యాణ్‌’ సినిమాకు కోసం మూర్తన్నకు ఓ పాత్ర ఆఫర్‌ చేశారట. అప్పుడు కూడా ఆయన ఓకే చేయలేదు. మరిప్పుడు ‘హుషారు 2’లో ఎలా ఓకే చేశారో మరి. ఆ విషయం పక్కన పెడితే ఈ సినిమాలో మూర్తన్న పాత్ర క్లిక్‌ అయితే.. ఆయన తర్వాత ఓకే అంటే ఇతర దర్శకులు కూడా పవర్‌ఫుల్‌ పాత్రలు రాసుకుంటారు.

మరోసారి తన ప్రేమికుడి గురించి మాట్లాడిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus