Naga Vamsi: అందరూ అనుకుంటున్న డేట్‌కే వస్తాం.. కానీ మేం చెబితే ఎవరూ నమ్మరు

‘నాన్నా పులి..’ కథ విన్నారా? అందులో పిల్లాడు పులి అన్నప్పుడు రెండుసార్లు నమ్మిన ఆ తండ్రి.. ఆ ఊరి జనాలు ఆ తర్వాత అదే కుర్రాడు మూడోసారి చెబితే నమ్మరు. దాంతో నష్టం జరుగుతుంది. దీనికి టాలీవుడ్‌కి కాస్త అన్వయిస్తే సినిమా రిలీజ్‌ డేట్‌ని పులి అనుకుంటే.. ఊరు జనాలను ప్రేక్షకులు అనుకోవచ్చు. ‘సినిమా ఫలానా తేదీన వస్తుంది’ అని చెప్పడాన్ని ‘నానా పులి’ అనుకోవచ్చు. అక్కడ పిల్లాడు అబద్దం చెప్పడం తప్పు అయితే.. ఇక్కడ రిలీజ్‌ డేట్‌ని చెప్పి నిలబెట్టుకోవడం కూడా అలాంటిదే.

Naga Vamsi

చెప్పిన డేట్‌కి సినిమాను తీసుకురావడం నిర్మాత నాగవంశీకి ఎప్పటి నుండో అలవాటు లేదు. ఈ విషయాన్ని ఆయనే చెప్పారు కూడా. అలా ఆయన వెంకటేశ్‌ – దర్శకుడు త్రివిక్రమ్‌ కలయికలో నిర్మించిన సినిమా ‘ఆదర్శ కుటుంబం హౌస్‌ నెం-47’ సినిమాను కూడా వాయిదా వేస్తూ వస్తున్నారు. అక్టోబరు 2 నుండి 9కి వచ్చింది. ఇప్పుడు అక్టోబరు 30 అంటున్నారు. అయితే ఇంకా క్లారిటీ లేదు. ఈ విషయం గురించి నాగవంశీ ఇటీవల ఓ ప్రెస్‌ మీట్‌లో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటికే అందరికీ తెలిసిన ఆ తేదీకే ‘ఆదర్శ కుటుంబం’ సినిమా రానుంది. కాకపోతే నేను చెప్తే ఇప్పుడెవరూ నమ్మేలా లేరు. అందుకే ఈ నెల 21 లేదా 22న ట్రైలర్‌ విడుదల చేసి వెంకటేశ్‌తోనే విడుదల తేదీని అనౌన్స్‌ చేయిస్తాం అని చెప్పారు. అంటే ఇక్కడ వాయిదా వేసిన ఆయనను కాకుండా.. కొత్త డేట్‌ని నమ్మని ప్రేక్షకుల్ని ఆయన తప్పుపడుతున్నారు. అన్నట్లు ఈ నెల 19న ‘మాల..’ అనే పాటను రిలీజ్‌ చేస్తున్నారు. ఆ రోజు ఏమన్నా రిలీజ్‌ డేట్‌ లీక్‌ ఇస్తారేమో చూడాలి.

అన్నట్లు.. త్రివిక్రమ్‌తో చాలా ఏళ్లుగా కలసి ఉండటం వల్లనేమో నాగవంశీ ఇలా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ‘నాన్నా పులి’ అని ఆ పిల్లాడు అరిచినప్పుడు మూడోసారి కూడా ఆ తండ్రి వెళ్లాల్సింది అనేది ఆయన చెప్పిన తత్వం కాబట్టి. గుర్తుందిగా ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’లోని డైలాగ్‌.

రామ్‌ చరణ్‌ ఓ నాలుగేళ్లు వదులుకోవాల్సిందేనా? మరోసారి ‘పుష్ప’ స్టైల్‌లోకి సుకుమార్‌

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus