Rc 17: రామ్‌ చరణ్‌ ఓ నాలుగేళ్లు వదులుకోవాల్సిందేనా? మరోసారి ‘పుష్ప’ స్టైల్‌లోకి సుకుమార్‌

రామ్‌చరణ్‌ – సుకుమార్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. రామ్‌చరణ్‌ ‘పెద్ది’ సినిమాలో కుస్తీ పట్టిన అన్నీ రోజులు చాలా నెలలుగా కథ మీద కుస్తీ పట్టారు సుకుమార్‌ అండ్‌ కో. రీసెంట్‌గా అంతా ఓకే అనుకుని సినిమా ఆఫీసు కూడా స్టార్ట్‌ చేశారు. ఆ సందర్భంగా క్లిక్‌ మనిపించిన ఫొటోనే సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసి లైక్‌లు సంపాదించారు. దసరా సందర్భంగా సినిమాను స్టార్ట్‌ చేస్తారు అని చెబుతున్నారు.

Rc 17

ఆ విషయం పక్కన పెడితే మరో విషయం తెలిసిందే. అదే ఈ సినిమాను కూడా లెక్కల మాస్టారు రెండు ముక్కలు చేస్తున్నారట. ఇంకా పేరు పెట్టుకోని, కొబ్బరికాయ కొట్టుకోని, క్లాప్‌ పడని ఈ సినిమాను రెండు పార్టులుగానే చేయాలని ఇప్పటికే ఫిక్స్‌ అయ్యారట. ఈ మేరకు రామ్‌చరణ్‌ కూడా ఓకే అయ్యారట. అయితే రెండు పార్టుల మధ్య గ్యాప్‌ ఏళ్ల తరబడి కాకుండా, నెలల తరబడి ఉండేలా చూసుకోవాలని రామ్‌ చరణ్‌ సూచించారట.

ఎందుకంటే ‘పుష్ప’ సినిమా విషయంలో ఇదే జరిగింది. రెండు పార్టుల మధ్య గ్యాప్‌ చాలా ఎక్కువైంది. ‘ధురంధర్‌’ సినిమాల తరహాలోనే ఈ సినిమా వేగంగా వచ్చేలా చూడాలి అనుకుంటున్నారట. మరీ లేట్‌ అయితే ‘దేవర’, ‘కల్కి’, ‘సలార్‌’ లా చాలా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కొన్ని ఆగిపోయే అవకాశమూ ఉంది. అయితే లెక్కల మాస్టారూ ఏదీ ఒక పట్టాన తేల్చరు. కథను చెక్కుతూనే ఉంటారు. కాబట్టి ఈ మాట ఎంతవరకు నిలబడుతుందో చూడాలి.

ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా ‘ధురంధర్‌’ ఫేమ్‌ సారా అర్జున్‌ను తీసుకుంటున్నారని ఓ టాక్‌. సినిమా ఓపెనింగ్‌కి ఆమెను కూడా తీసుకొస్తున్నారని సమాచారం. మరి కథేంటి, నేపథ్యమేంటి అనేది ఏమైనా ఓపెనింగ్‌ సందర్భంగా చెబుతారేమో చూడాలి. సినిమా లాంఛనంగా దసరాకు ప్రారంభించి.. డిసెంబరులో రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తారని భోగట్టా.

పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus