నేచురల్ స్టార్ నాని కాస్తా.. మాస్ స్టార్ నాని అవ్వాలని అనుకుంటున్నాడు. గత కొన్ని ఏళ్లుగా ఇదే మాట తెలుగు సినిమా వర్గాల్లో ఈ మాట వినిపిస్తూనే ఉంది. దానికి కారణం ఆయన తన కథల ఎంపికలో ఇటీవల కాలంలో చేసుకున్న మార్పులు, కథలు వింటున్న దర్శకులు. అయితే ఈ మాటను ఆయన కాదంటారు. ఇప్పుడే కాదు ఈ దిశగా ఆయన అడుగులు వేసినప్పటి నుండి ఇదే మాట అంటూనే ఉన్నారు. ఇప్పుడు ‘ప్యారడైజ్’ సినిమా ఇబ్బందికర ఫలితం అందుకున్న నేపథ్యంలో మోసారి ఈ మాట చర్చలోకి వచ్చింది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ ఈ మేరకు కొన్ని కామెంట్స్ చేశారు. మీరు తర్వాత చేయబోయే సినిమా ఫ్యామిలీ కథాంశం నేపథ్యంలోనిదే కదా అని అడిగితే.. అలాంటి సినిమా వస్తోంది. అయితే మొత్తంగా అది ఫ్యామిలీ కథ కాదు. అదొక ప్రేమ కథ అని చెప్పాడు నాని. ఇందులో పిల్లలకు నచ్చే అంశాలు కూడా ఉంటాయి అని చెప్పాడు. ‘హిట్ 3’, ‘ప్యారడైజ్’ సినిమాలకు A సర్టిఫికేట్ వచ్చిందని గుర్తు చేశాడు.
అయితే, తనను పిల్లలు, కుటుంబ ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారని.. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే సినిమాలు చేస్తున్నానని చెప్పాడు. అయితే ‘హిట్ 3’, ‘ప్యారడైజ్’, ‘దసరా’ లాంటి మాస్ కథలు, రక్తపాత కథలు చేస్తూ.. ఇప్పుడు ‘బ్లడీ రోమియో’ అంటూ యాక్షన్ సినిమాకు ఓటేస్తూ.. తనకు మాస్ హీరో ఇమేజ్ అక్కర్లేదు అని అనడం ఎందుకో నానినే చెప్పాలి. దానికితోడు ‘బ్లడీ రోమియో’ అందరూ చూసేలా ఉంటుంది అని చెబుతున్నాడు నాని.
నిజమే, నానికి ఇప్పుడు అన్ని రకాల ప్రేక్షకుల అభిమానం అవసరమే. అయితే దానికి తగ్గ కథలు తీసి అలాంటి కోరికలు పెట్టుకుంటే ఓకే.. మాస్ సినిమాలు చేసి తిరిగి పాత నానిని చూస్తారు.. అందరూ థియేటర్లకు రండి అని చెబితే.. ఇబ్బంది పడే అవకాశం ఉంది.