Nani: లైనప్‌పై క్లారిటీ ఇచ్చేసిన నాని.. ఎప్పుడు ఏ సినిమా అంటే?

Advertisement

మొన్నీమధ్య ఓ ఈవెంట్‌లో నాని  (Nani) మాట్లాడుతూ తన తర్వాతి సినిమాలో పోలీసుగా కనిపిస్తాను అని చెప్పాడు. దీంతో ఏంటి.. నాని లైనప్‌ మారిపోయిందా అనే డిస్కషన్‌ మొదలైంది. ఎందుకంటే గతంలో చెప్పిన వివరాల ప్రకారం అయితే నాని నెక్స్ట్‌ శ్రీకాంత్‌ ఓదెల (Srikanth Odela) సినిమా చేస్తారు అని అన్నారు. కానీ ఇప్పుడు పోలీసు అనేసరికి డౌట్స్‌ వచ్చాయి. అయితే ఇప్పుడు నాని ఫుల్‌ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం నాని తన తర్వాతి సినిమా ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram)  (Saripodhaa Sanivaaram) పనుల్లో బిజీగా ఉన్నాడు.

Nani

నెలాఖరున రానున్న ఈ సినిమా ప్రచారంలో బిజీగా ఉన్నాడు. క్లాస్, మాస్ మిక్స్ చేసిన సినిమా మీద నాని, అతని అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. అందుకే ఆ సినిమా ఎలాగూ హిట్టు.. తర్వాతి సినిమా ఏంటో చూద్దాం అని అనుకుంటున్నారు. నాని కొత్త ప్రాజెక్టుల విషయంలో నిన్నమొన్నటి దాకా కొంచెం గందరగోళం ఉండేది. దానికి కారణం ‘బలగం’ ’ (Balagam) సినిమా ఫేమ్ వేణుతో (Venu Yeldandi)  ఓ సినిమా అంటూ వార్తలొచ్చి, కన్ఫర్మేషన్‌ వచ్చింది.

అయితే ఆ తర్వాత ఆ ప్రోజెక్ట్‌ ఆగిపోయిందని క్లారిటీ ఇచ్చేశారు. ఈ క్రమంలో కొత్త సినిమాల లైనప్‌ ఆర్డర్‌ మారింది. ‘ఓజీ’ (OG) దర్శకుడు సుజీత్‌తో (Sujeeth) నాని నెక్స్ట్‌ సినిమా అని అనౌన్స్‌మెంట్‌ వచ్చింది కూడా. అయితే ఇప్పుడు దానిని రెండు సినిమాల వెనక్కి పంపారట. నాని ఇప్పుడు ‘హిట్ 3’ శ్రీకాంత్ ఓదెల సినిమాలను ఒకేసారి స్టార్ట్‌ చేస్తారు అని అంటున్నారు. సెప్టెంబరు తొలి వారంలో ఈ సినిమాలకు సంబంధించి అధికారిక ప్రకటనలు వస్తాయట. ఆ రెండు సినిమాల తర్వాతే సుజీత్‌ సినిమా ఉంటుందట.

ఆ సినిమాలో నాని తన అభిమానులు ఎప్పట్నుండో చూడాలనుకుంటున్న పవర్ ఫుల్, ఫెరోషియస్, మాస్ అవతారంలో కనిపిస్తాడట. అయితే, ఇవన్నీ ‘సరిపోదా శనివారం’ ఫలితం బట్టే ఉంటాయి అని చెప్పొచ్చు. ఆ సినిమా ఫలితం ఇచ్చే బూస్టింగ్‌ లేదా ఇబ్బందితో లైనప్‌, ఆర్డర్‌ మారొచ్చు అని అంటున్నారు.

 ‘ఆయ్’ 3 రోజుల్లో డబుల్ అయ్యాయీగా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus