Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Advertisement

శర్వానంద్ హీరోగా సాక్షి వైద్య, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా రూపొందిన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘నారీ నారీ నడుమ మురారి'(Nari Nari Naduma Murari). ‘ఏకె ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘సామజవరగమన’ వంటి బ్లాక్ బస్టర్ అందించిన రామ్ అబ్బరాజు ఈ సినిమాకి దర్శకుడు. సంక్రాంతి కానుకగా జనవరి 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా.

Nari Nari Naduma Murari Collections

కంటెంట్ పై ఉన్న కాన్ఫిడెన్స్ తో జనవరి 14 సాయంత్రం నుండే ప్రీమియర్ షోలు వేశారు. వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద తొలి రోజు ఈ సినిమా మంచి వసూళ్లు సాధించింది.రెండో రోజు నుండీ మరింత స్ట్రాంగ్ గా నిలదొక్కుకుంది.

మొదటి వారం చాలా బాగా క్యాష్ చేసుకున్న ఈ సినిమా.. రెండో వారంలో కూడా బాగా కలెక్ట్ చేసింది.బ్రేక్ ఈవెన్ సాధించింది. 3వ వారంలో కూడా డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇవ్వడం విశేషంగా చెప్పుకోవాలి. ఓటీటీలో రిలీజ్ అయినప్పటికీ..ఈ సినిమా బాగానే నిలబడింది.ఒకసారి 20 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 5.16 cr
సీడెడ్ 1.42 cr
ఆంధ్ర(టోటల్) 6.98 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 13.56 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.08 cr
ఓవర్సీస్ 3.22 cr
టోటల్ వరల్డ్ వైడ్ 17.86 కోట్లు

‘నారీ నారీ నడుమ మురారి'(Nari Nari Naduma Murari) చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.12 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. చాలా ఏరియాల్లో నిర్మాతలు ఓన్ రిలీజ్ చేసుకున్నారు. మొత్తంగా ఈ సినిమా రూ.17.86 కోట్ల షేర్ ను రాబడితే చాలు బ్రేక్ సాధించి క్లీన్ హిట్..గా నిలిచినట్టే. ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా.. 20 రోజులు పూర్తయ్యేసరికి  రూ.17.86 కోట్ల షేర్ ను రాబట్టింది.గ్రాస్ పరంగా రూ.34.28 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా ఈ సినిమా ఇప్పటివరకు రూ.5.36 కోట్ల లాభాలు అందించింది.

వా తలైవా వా.. పారిశుద్ధ్య కార్మికురాలిని ఇంటికి పిలిచి సన్మానించి

 

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus