సినీ పరిశ్రమలో ఎవరి ఫేట్ ఎలా ఉంటుందో అంచనా వేయడం చాలా కష్టం. కానీ నైపుణ్యం, పట్టుదల, కఠోర శ్రమ వంటివి ఉంటే ఎంతటి స్థాయికైనా చేరుకోవచ్చని న్యాచురల్ స్టార్ నాని(Nani) నిరూపించాడు. ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి, ఇప్పుడు టాప్ హీరోగా రాణిస్తున్నాడు. అతని సినీ ప్రయాణం ఎంతో మందికి ఆదర్శం. నాని హీరో కాకముందు ఆర్ జె గా, క్లాప్ బాయ్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు అనే సంగతి చాలా మందికి తెలిసిన సంగతే.!
కాకపోతే ఏ సినిమాలకి పనిచేశాడు అనే విషయం అందరికీ పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు. ఆ విషయాలు అటుంచితే.. సరిగ్గా 20 ఏళ్ల క్రితం.. అంటే 2005లో నితిన్ హీరోగా ‘అల్లరి బుల్లోడు’ అనే సినిమా వచ్చింది. దీనికి నాని అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. కట్ చేస్తే, ఇప్పుడు నాని స్టార్ గా ఎదిగాడు. అంతేకాకుండా అభిరుచి గల నిర్మాత కూడా రాణిస్తున్నాడు. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే.. ‘అల్లరి బుల్లోడు’ సినిమా టైమ్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా నితిన్‌కు క్లాప్ కొట్టిన నాని, ఇప్పుడు అదే నితిన్ హీరోగా నటిస్తున్న ఓ సినిమాకి నిర్మాతగా వ్యవహరించే రేంజ్..కి ఎదిగాడు.
అవును నితిన్ హీరోగా ‘అలియాస్ రుక్మిణీ’ అనే సినిమా రూపొందుతోంది. నాని సమర్పణలో అతని సోదరి దీప్తి గంట ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘దండోరా’ సినిమాకి రైటర్ గా పనిచేసిన మురళీకాంత్ ఈ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈరోజు పూజాకార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది ఈ సినిమా. కాన్సెప్ట్ వీడియోని కూడా వదిలారు. చాలా ప్లెజెంట్ గా ఉంది. ఈ ప్రాజెక్టుతో నితిన్ కచ్చితంగా సక్సెస్ కొడతాడు అనే నమ్మకాన్ని ఇచ్చింది ఆ కాన్సెప్ట్ వీడియో..!