సీనియర్ స్టార్ నిర్మాత, దర్శకుడు అయినటువంటి ఎం.ఎస్. రాజు ‘అగధ'(Agadha) అనే మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్, సిజ్జు, రోషన్, శ్రేయరాణి రెడ్డి వంటి స్టార్స్ నటిస్తున్న సినిమా ఇది. ప్రమోషన్లలో భాగంగా విడుదల చేసిన టీజర్, పోస్టర్స్ అన్నీ మంచి రెస్పాన్స్ ను రాబట్టుకున్నాయి. తాజాగా ‘అగధ’ ట్రైలర్‌ను కూడా వదిలారు.
2 నిమిషాల 14 సెకన్ల నిడివి కలిగిన ‘అగధ’ ట్రైలర్ ను గమనిస్తే.. ” ‘మహిమ’ అనే అమ్మాయి ఆత్మహత్యతో ట్రైలర్ మొదలైంది. ఆమె ఎందుకలా చేసుకుంది? చనిపోయేముందు ఆమె ఎక్కడికి వెళ్ళింది? అక్కడ ఏం చూసింది? వంటి ఎన్నో ప్రశ్నలతో ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నట్టు చూపించారు. ‘అగధ’ అంటే చీకటి శక్తి అనే సంగతి తెలిసిందే. అంటే ఈ సినిమాలో విలన్ మనిషి కాదు అనుకోవాలేమో అన్నట్టు కొన్ని విజువల్స్ ఉన్నాయి.
చీకటి లోకం నుండి పుట్టుకొచ్చిన మంత్ర తంత్రాలకు కూడా అందని మహాశక్తి ఉందనే డైలాగులు కూడా ఉన్నాయి. ‘అగధ’కి ముల్లోకాలను శాసించాలనే వక్రబుద్ధి ఉన్నట్టు కూడా సంభాషణలు ఉన్నాయి. ‘నీ చుట్టూ చెడు చేసే పిచ్చి భూతాలు ఉంటే, నా చుట్టూ సృష్టిని నడిపించే పంచభూతాలు ఉన్నాయి’ అంటూ కామాక్షి భాస్కర్లతో పలికించిన డైలాగ్ పవర్ఫుల్ గా ఉంది. ‘మహాదేవి వాళ్ళ కుటుంబాన్ని కాపాడాలని చూస్తుంటే, అగథ మాత్రం వదలకుండా వెంటాడుతోందని’ ట్రైలర్ ఎండింగ్లో మరో సస్పెన్స్ తో కూడుకున్న డైలాగ్ ను పెట్టారు.
దాంతో సినిమాపై ఆసక్తిని పెంచారు అనే చెప్పాలి. అలాగే ట్రైలర్ లోని విజువల్స్ కూడా బాగున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :