Nani: ఆ స్టార్ల కంటే ఎక్కువ రెమ్యునరేషన్.. అక్కడ కూడా సక్సెస్ అయ్యారుగా!

  • February 25, 2024 / 05:37 PM IST

న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో మినిమం గ్యారంటీ హీరోగా నానికి పేరుంది. నాని నటిస్తున్న సరిపోదా శనివారం మూవీ నుంచి తాజాగా గ్లింప్స్ రిలీజ్ కాగా ఈ గ్లింప్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాతో నాని మరో బ్లాక్ బస్టర్ అందుకుంటారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకుడు కాగా ఈ సినిమాతో వివేక్ దర్శకుడిగా స్థాయిని పెంచుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

డీవీవీ దానయ్య నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే తాజాగా నాని గ్రాండ్ గా తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. నాని ఖాతాలో కొన్ని అరుదైన రికార్డ్ లు కూడా ఉన్నాయి. భలే భలే మగాడివోయ్ సినిమా నుంచి వరుసగా 7 హిట్లను నాని ఖాతాలో వేసుకున్నారు. బ్యాగ్రౌండ్ లేకుండా కెరీర్ పరంగా ఎదిగి ఇలా 7 హిట్లను సాధించిన హీరోలు భారతీయ సినీ చరిత్రలోనే చాలా తక్కువమంది ఉన్నారు.

చాలామంది సీనియర్ స్టార్ హీరోలు, మిడిల్ రేంజ్ హీరోల కంటే నాని రెమ్యునరేషన్ ఎక్కువ కావడం గమనార్హం. నాని సినిమాల నాన్ థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడవుతున్నాయి. దసరా, హాయ్ నాన్న సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్న నాని తర్వాత సినిమాలతో సైతం ప్రేక్షకులను మెప్పించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

న్యాచురల్ స్టార్ నాని (Nani) కొత్త డైరెక్టర్లకు, యంగ్ డైరెక్టర్లకు ఎక్కువగా అవకాశాలు ఇస్తుండటం గమనార్హం. స్టార్ హీరోయిన్ల కంటే టాలెంటెడ్ హీరోయిన్లకే నాని ప్రాధాన్యత ఇస్తున్నారు. నాని బలగం వేణు కాంబోలో సైతం ఒక సినిమా తెరకెక్కుతోంది. నాని త్రివిక్రమ్ కాంబినేషన్ గురించి వార్తలు జోరుగా వినిపిస్తుండగా ఈ కాంబినేషన్ గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నాని సినిమా సినిమాకు ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు.

సుందరం మాస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!

మస్తు షేడ్స్ ఉన్నయ్ రా సినిమా రివ్యూ & రేటింగ్!
సిద్ధార్ధ్ రాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags