Masthu Shades Unnai Ra Review in Telugu: మస్తు షేడ్స్ ఉన్నయ్ రా సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • అభినవ్ గోమఠం (Hero)
  • వైశాలి (Heroine)
  • అలీ రెజా,నిళల్‌గళ్ రవి, లావణ్య రెడ్డి, తరుణ్ భాస్కర్,మొయిన్ మొహమ్మద్ త‌దిత‌రులు (Cast)
  • తిరుపతి రావ్ (Director)
  • భవాని కాసుల (Producer)
  • సంజీవ్ టి (Music)
  • సిద్ధార్థ స్వయంభు (Cinematography)
  • Release Date : ఫిబ్రవరి 23, 2024

ఫిబ్రవరి నెల చివరి వారంలోకి వచ్చేశాం. ఈ చివరి వారంలో కూడా చిన్న సినిమాలు రిలీజ్ కి క్యూలు కట్టాయి. ఇందులో ‘మస్త్ షేడ్స్ ఉన్నయ్ రా’ మూవీ ఒకటి. తన కామెడీతో కడుపుబ్బా నవ్వించే స్టార్ కమెడియన్ అభినవ్ గోమఠం ఈ చిత్రంతో హీరోగా మారాడు. మరి హీరోగా అభినవ్ సక్సెస్ అందుకున్నాడో లేదో ఓ లుక్కేద్దాం రండి :

కథ: టెన్త్ క్లాస్ కే చదువు ఆపేసి పెయింటర్ గా మారతాడు మనోహర్(అభినవ్ గోమఠం). తన తండ్రి చనిపోవడంతో అతని కుటుంబానికి ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి.దీంతో అతను గోడలపై పెయింట్స్ వేసుకొంటూ కుటుంబ అవస్రతలు తీరుస్తూ ఉంటాడు. ఈ క్రమంలో అతని స్నేహితుడు రాహుల్(అలీ రెజా) .. మనోహర్ కి పెద్ద సమస్యగా మారతాడు. ముందుగా మనోహర్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని.. తన స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు రాహుల్. దీంతో జీవితంలో ఎదిగి తానేంటో చూపించాలని మనోహర్ ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకోవాలని భావిస్తాడు.

అందుకోసం ఫోటో షాప్ నేర్చుకుంటున్న టైంలో ఉమాదేవి (వైశాలి రాజ్)తో అతనికి పరిచయం ఏర్పడుతుంది. మరోపక్క ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకోవడానికి మనోహర్ కి లోన్ కూడా సాంక్షన్ అవుతుంది. అయితే అనుకోకుండా కురిసిన వర్షాలు, పిడుగుల వల్ల మనో కొనుగోలు చేయాలనుకున్న సెకండ్ హ్యాండ్ ప్రింటింగ్ మిషన్ పాడైపోతుంది? ఆ తర్వాత ఏమైంది? మను కెరీర్లో సక్సెస్ అయ్యాడా లేదా? ఉమతో అతని లవ్ స్టోరీ ఏమైంది? అనేది మిగిలిన కథ.

నటీనటుల పనితీరు: అభినవ్ గోమఠం స్టార్ కమెడియన్ మాత్రమే కాదు.. అతనిలో హీరో కూడా ఉన్నాడు అని ఈ సినిమా ప్రూవ్ చేసింది. హీరోగా కూడా అభినవ్ సినిమాలు చేయొచ్చు అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. తన మార్క్ సెటిల్డ్ పెర్ఫార్మన్స్ తో ఈ సినిమాకి వన్ మెన్ షో చేశాడు అభినవ్. ఇక హీరోయిన్ వైశాలి కూడా నేచురల్ గా నటించింది అనే కంటే కూడా కనిపించింది అని చెప్పడం బెటర్. అభినవ్ తర్వాత ఆ రేంజ్లో పెర్ఫార్మ్ చేసింది అలీ రెజా అని చెప్పాలి. నెగిటివ్ రోల్లో కూడా చాలా చక్కగా నటించాడు.

నిళల్‌గళ్ రవి, మొయిన్ మొహమ్మద్ సపోర్టింగ్ రోల్స్ లో ఆకట్టుకున్నారు. తరుణ్ భాస్కర్ గెస్ట్ రోల్ బాగానే ఉంది. హీరో తల్లిగా చేసిన సీరియల్ నటి జ్యోతి రెడ్డి కూడా బాగానే నటించింది. కానీ ఎందుకో ఈమె సినిమాల్లో బిజీ అవ్వలేకపోతుంది. మిగిలిన నటీనటులు ఓకే అనేలా పెర్ఫార్మ్ చేశారు.

సాంకేతిక నిపుణుల పనితీరు: దర్శకుడు తిరుపతి రావ్ మంచి పాయింట్ ను ఎంపిక చేసుకున్నాడు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి చెందిన యూత్ కి ఈ కథ బాగా కనెక్ట్ అవుతుంది. క్యాస్టింగ్ సెలక్షన్ విషయంలో కూడా అతన్ని అభినందించొచ్చు. కానీ కథనం ఆసక్తిగా సాగిందా? అంటే ‘లేదు అనే సమాధానమే’ ఎక్కువగా వినిపిస్తుంది. అక్కడక్కడా కొన్ని మంచి సీన్లు పడ్డాయి. కానీ కథనంలో చాలా ల్యాగ్ ఉంది. కెరీర్లో బాగా రాణించాలని యువత తొందరపాటులో తీసుకునే నిర్ణయాలను ఇందులో చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు.

అతని ఆలోచన మంచిదే కానీ.. హీరో జర్నీలో సరైన కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఏమీ లేదు. నెగిటివ్ రోల్ చేసిన అలీ రెజా ట్రాక్ చాలా వీక్ గా ఉంది. లవ్ స్టోరీ కూడా బోర్ కొట్టిస్తుంది. సంగీతం విషయానికి వస్తే.. ఫస్ట్ సాంగ్ ఒకటి బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెద్దగా ఆకట్టుకోలేదు. సినిమాటోగ్రఫీ కూడా చాలా వీక్ గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఆకర్షించేలా ఏమీ లేవు.

విశ్లేషణ: అభినవ్ గోమఠం హీరోగా అయితే సక్సెస్ అయ్యాడు. కానీ సినిమా మాత్రం ఆకట్టుకునే విధంగా లేదు. ఓటీటీకి వచ్చాక ఒకసారి ట్రై చేయొచ్చేమో కానీ, ప్రేక్షకులను థియేటర్ కి తీసుకొచ్చేంత విషయం అయితే ఇందులో లేదు.

రేటింగ్ : 1.5/5

Rating

1.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus