Nawazuddin Siddiqui Remuneration: హాట్ టాపిక్ గా మారిన హీరో పారితోషికం!

ప్రముఖ ఉర్ధూ రచయిత సాదత్ హాసన్ మాంటో జీవితం ఆధారంగా రూపొందించిన సినిమా ‘మాంటో’. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించాడు. నటి, దర్శకురాలు నందితా దాస్ ఈ సినిమాను డైరెక్ట్ చేసింది. రిషి కపూర్‌, రన్‌వీర్ షోరే, జావేద్ అక్తర్‌, పరేష్‌ రావల్‌, దివ్యా దత్త వంటి తారలు కీలక పాత్రల్లో నటించారు. అయితే వీరంతా ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా ఫ్రీగా నటించారట.

అప్పట్లో ఈ విషయాన్ని నందితా దాస్ స్వయంగా మీడియాకు వెల్లడించారు. డబ్బు కోసం కాకుండా స్క్రిప్ట్ కు విలువిచ్చి వారంతా పైసా తీసుకోకుండా నటించారని తెలిపారు. మరి ఈ సినిమాలో హీరోగా నటించిన నవాజుద్దీన్ ఎంత తీసుకున్నారనే విషయం ఆసక్తికరంగా మారింది. బాలీవుడ్ లో టాలెంటెడ్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ నటుడు ఒక్కో సినిమాకి కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటాడు. అలాంటి నటుడు ‘మాంటో’ సినిమా కోసం రెమ్యునరేషన్ గా ఒక్క రూపాయి తీసుకున్నారట.

ఈ విషయాన్ని నవాజుద్దీన్ స్వయంగా చెప్పారు. మాంటో సినిమా ద్వారా తన ఆలోచనలను, ఆశయాలను వ్యక్తీకరించాలనుకున్న నవాజుద్దీన్ నందిత దగ్గర నుండి డబ్బులు ఆశించానంటే అంతకంటే అపరాధం మరొకటి ఉందని.. కానీ ప్రొఫెషనల్ నటుడిగా ఒక్క రూపాయి మాత్రం తీసుకున్నానని చెప్పుకొచ్చారు నవాజుద్దీన్.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus