ప్రముఖ నటుడి పై.. అతని భార్య షాకింగ్ కామెంట్స్ వైరల్..!

నేను హాస్పిటల్ లో పురిటినొప్పులు పడుతుంటే నా భర్త ఇంటికి అమ్మాయిలను తెచ్చుకుని రొమాన్స్‌ చేసేవాడు అంటూ ఇటీవల విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిక్ భార్య ఆలియా చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. గత కొద్ది రోజుల నుండీ నవాజ్,అలియాల గొడవ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ విడిపోయినప్పటికీ.. నవాజుద్దీన్ సిద్ధిక్ భార్య .. అతని పై ఆరోపణలు చేస్తూనే ఉంది. ఇటీవల మరోసారి అలియా చేసిన కామెంట్స్ పెద్ద ధూమారాన్నే రేపాయి.

ఆమె మాట్లాడుతూ.. “నాకు నెలలు నిండిన సమయంలో ఓ రోజు నొప్పులు మొదలయ్యాయి. దాంతో వెంటనే నన్ను హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. నవాజ్‌ కుటుంబ సభ్యులు కూడా నా దగ్గరే ఉన్నారు. అయితే డెలివరీ తరువాత నా ఆరోగ్యం అంత బాగోకపోవడంతో.. కొద్ది రోజుల పాటు హాస్పిటల్ లోనే ఉండాల్సి వచ్చింది. ఆ టైములో ‘భర్త పక్కన ఉంటే బాగుణ్ణు’ అని ప్రతీ భార్య కోరుకుంటుంది. నాకు అలాగే అనిపించింది. కానీ ఆ టైములో నా భర్త నవాజ్‌ నాతో ఉండేవాడు కాదు.

నేను డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాక.. నాకు కొన్ని భయంకరమైన నిజాలు తెలిసాయి. వాటిని నేను జీర్ణించుకోలేకపోయాను. అవేంటంటే..’ నేను హాస్పిటల్ లో ఉండే టైం లో నవాజ్‌ గంటల కొద్దీ అమ్మాయిలతో ఫోన్‌లో మాట్లాడేవాడట. అంతేకాదు కొన్ని సార్లు అయితే అమ్మాయిలనే ఇంటికి తెచ్చుకునేవాడట. నాకు ఈ విషయాన్ని తెలియజేసింది మరెవరో కాదు.. నవాజ్‌ సోదరుడే” అంటూ చెప్పుకొచ్చింది అలియా.

Most Recommended Video

15 డైరెక్టర్స్ కెరీర్ ను ఇబ్బందిలో పడేసిన సినిమాలు ఇవే!
కులాంతర వివాహాలు చేసుకొని ఆదర్శంగా నిలిచిన మన హీరోలు!
హీరోయిన్స్ కంటే ముందు బాలనటిగా అలరించిన తారల!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus