‘జవాన్’ సినిమాలో షారుఖ్ ఖాన్, నయనతార జోడీ నటిస్తోంది అని తెలిసేసరికి.. ఆ కాంబినేషన్ గురించి ఎనలేని క్రేజ్ ఏర్పడింది. ఎందుకంటే బాలీవుడ్ స్టార్ హీరో, సౌత్ స్టార్ హీరోయిన్ కాబట్టి. ఇక సినిమా విడుదలయ్యాక అయితే వెండితెర మీద ఆ జోడీని చూసి ఫ్యాన్స్ ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే నిజానికి ఈ పెయిర్‌ను ఒకే ఫ్రేమ్‌లో పదేళ్ల క్రితమే చూడాల్సిందట. అయితే అప్పుడు వీలుకాకపోవడంతో ఇన్నాళ్లకు అంటే 10 ఏళ్లకు వీలైంది.
షారుఖ్ ఖాన్ రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ అంటే ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ అనే చెప్పాలి. ఆ సినిమాలోనే షారుఖ్ ఖాన్, నయనతార నటించాల్సిందట. కానీ అప్పుడు వీలవ్వలేదు. అంటే దీపిక పడుకొణె పాత్రలో అనుకునేరు… కాదు కాదు. సినిమాలోని ‘వన్ టూ త్రీ ఫోర్…’ అనే పాటలో నయనతార డ్యాన్స్ చేయాల్సింది. సినిమాలో ఆ పాటలో షారుఖ్ ఖాన్ సరసన ప్రియమణి నటించింది. కానీ తొలుత ఆ పాత్ర కోసం నయనతారను (Nayanatara) అడిగారట.
‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ సినిమాలో సౌత్ నేపథ్యంలో సాగేదే. అందుకే ‘వన్ టూ త్రీ ఫోర్..’ పాటలో దక్షిణాది హీరోయిన్ ఉంటే బాగుంటుంది అని దర్శకుడు రోహిత్ శెట్టి అనుకున్నారు. అలా ముందుగా నయనతారను సంప్రదించారట. అయితే ఆ ఆఫర్‌ను నయన్ తిరస్కరించడంతో అందులోకి ప్రియమణి వచ్చింది. అలా 10 ఏళ్ల క్రితం మిస్ అయిన ఈ జోడీ ఇప్పుడు ‘జవాన్’ రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అన్నట్లు ఆ సినిమాలో నటించిన ప్రియమణి ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించింది.
అంతేకాదు ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ సినిమాలో హీరోయిన్గా నటించిన దీపికా పడుకొణె ‘జవాన్’ సినిమాలో అతిథి పాత్రలో కనిపించింది. అలా ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’కి, ‘జవాన్’కి చాలా సంబంధాలే ఉన్నాయి. ఇక సెప్టెంబరు 7న విడులైన ‘జవాన్’కు మంచి టాక్ వచ్చింది. బాలీవుడ్‌కి మంచి బ్లాక్‌బస్టర్ పడింది అంటూ ఫ్యాన్స్ ఖుష్ అయిపోతున్నారు.
జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!