Nayanthara: కొత్త దర్శకుడితో నయన్ సినిమా!

  • June 23, 2021 / 04:06 PM IST

కన్నడ స్టార్ హీరో సుదీప్ కి తెలుగులో కూడా మంచి గుర్తింపు లభించింది. ‘ఈగ’ సినిమాలో ఆయన విలన్ అవతారాన్ని ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోలేరు. అంతగా తన పెర్ఫార్మన్స్ తో ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగాడు. అయితే ఆ తరువాత అతడికి తెలుగులో సరైన అవకాశాలు రాలేదు. ‘బాహుబలి’, ‘సైరా’ లాంటి సినిమాల్లో పెద్దగా గుర్తింపు లేని పాత్రల్లో కనిపించారు. ఇక్కడ అవకాశాలు లేకపోయినా.. కన్నడలో మాత్రం బిజీగానే ఉన్నారు.

అయితే చాలా ఏళ్ల తరువాత ఇప్పుడు సుదీప్ మళ్లీ నెగెటివ్ రోల్ చేయబోతున్నట్లు సమాచారం. అది కూడా ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో అని తెలుస్తోంది. అందులో హీరోయిన్ గా నయనతార నటించనుందట. తమిళంలో తెరకెక్కనున్న ఈ సినిమాను వివిధ భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ‘నెట్రికన్’ అనే సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న నయన్.. ప్రస్తుతం రజినీకాంత్ తో కలిసి ‘అన్నాత్తే’లో నటిస్తోంది. అలానే తన బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతుంది.

తాజాగా ఆమె డ్రీమ్ వారియర్స్ నిర్మాణంలో ఓ కొత్త సినిమా అంగీకరించింది. ఓ కొత్త దర్శకుడు ఈ సినిమాను రూపొందించనున్నారు. ఇది కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలుస్తోంది. ఇందులో సుదీప్ విలన్ పాత్ర పోషించనున్నాడట, నయన్ లాంటి హీరోయిన్ కి సుదీప్ విలన్ గా అనేసరికి సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus