టాలీవుడ్‌లో బాలయ్య బాబు సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నందమూరి నటసింహం తదుపరి ప్రాజెక్ట్ NBK 111 గురించి కొన్ని వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. వరుస సినిమాలతో బిజీగా ఉన్న బాలకృష్ణ, మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునే కథలపై దృష్టి పెట్టి ముందుకు సాగుతున్నారు.
తన తదుపరి చిత్రం దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కుతుండగా, మొదట ఈ సినిమా పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోతుందని టాక్ వినిపించినా, తర్వాత స్క్రిప్ట్‌లో మార్పులు జరిగి పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోందని సమాచారం. ఈ మార్పుల కారణంగానే హీరోయిన్ ఎంపికలో కూడా ట్విస్ట్ చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
మొదట ఈ సినిమాలో హీరోయిన్‌గా నయనతార పేరు వినిపించింది. అయితే తాజా సమాచారం ప్రకారం, కొన్ని క్రియేటివ్ మార్పుల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు టాక్. దీంతో హీరోయిన్‌గా ఎవరిని తీసుకుంటారు అనే ఆసక్తి అభిమానుల్లో పెరిగింది.
ఇప్పుడీ నయన్ ప్లేస్ లో కాజల్ అగర్వాల్ పేరు బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే బాలకృష్ణతో ఆమెకు మంచి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ఉండటంతో, మేకర్స్ ఆమెను ఫైనల్ చేసే దిశగా చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.
ఇక బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబినేషన్ అంటేనే మాస్ ఎంటర్‌టైన్మెంట్‌కు గ్యారంటీ అన్న అభిప్రాయం అభిమానుల్లో ఉంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ సినిమా మంచి విజయాన్ని అందుకున్న నేపథ్యంలో, ఈ ప్రాజెక్ట్‌పై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి.