టాలీవుడ్‌లో మాస్ యాక్షన్ సినిమాలపై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లే కాంబినేషన్‌గా భావిస్తున్న ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్‌పై ఇప్పుడు భారీ హైప్ నెలకొంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కీలక అప్డేట్ ఆఫీసియల్ గా రావటంతో నందమూరి అభిమానుల్లో ఆనందం మరింత రెట్టింపు అయింది.
ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. రిలీజ్ అనౌన్స్‌మెంట్‌తో పాటు విడుదలైన పోస్టర్‌లో ఎన్టీఆర్ షాడో లుక్ మాస్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది. అలాగే ఆయన పుట్టినరోజు సందర్భంగా 2026 మే 20న ప్రత్యేక గ్లింప్స్‌ను రిలీజ్ చేయనున్నట్లు తెలిపి, అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపారు.
ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. మ్యూజిక్ బాధ్యతలను రవి బస్రుర్ నిర్వహిస్తున్నారు. ఆయన ఇప్పటికే ప్రశాంత్ నీల్ సినిమాలకు అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
హీరోయిన్ విషయానికి వస్తే, ఈ ప్రాజెక్ట్ కోసం బాలీవుడ్ బ్యూటీ రుక్మిణి వసంత్ నటిస్తుండగా, ఆమె పాత్ర కూడా కథలో కీలకంగా ఉంటుందని టాక్. మొత్తానికి, ఎన్టీఆర్ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, ప్రశాంత్ నీల్ స్టైలిష్ మేకింగ్ తో ఈ సినిమా మరో భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలవడం ఖాయం అన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.