నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా కీర్తి సురేష్ (Keerthy Suresh) కాంబినేషన్లో రూపొందిన మొదటి సినిమా ‘నేను లోకల్’ (Nenu Local). తర్వాత వీరి కాంబినేషన్లో ‘దసరా’ కూడా వచ్చింది. అయితే నేటితో ‘నేను లోకల్’ రిలీజ్ అయ్యి 9 యేళ్ళు పూర్తికావస్తోంది కాబట్టి.. ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం.
‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు (Dil Raju) నిర్మాణంలో నాని చేసిన మొదటి సినిమా ఇది. త్రినాథ రావ్ నక్కిన (Trinadha Rao) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2017 ఫిబ్రవరి 3న రిలీజ్ అయ్యింది.
అన్ సీజన్ లో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షో తోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. నాని ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, ప్రసన్న కుమార్ బెజవాడ (Prasanna Kumar Bezawada) రైటింగ్, దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం ఈ సినిమాకి హైలెట్స్ అని చెప్పాలి. మరి టోటల్ రన్లో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
| నైజాం | 10.65 cr |
| సీడెడ్ | 3.30 cr |
| ఉత్తరాంధ్ర | 4.02 cr |
| ఈస్ట్ | 2.41 cr |
| వెస్ట్ | 1.51 cr |
| కృష్ణా | 2.02 cr |
| గుంటూరు | 1.95 cr |
| నెల్లూరు | 0.82 cr |
| ఏపీ + తెలంగాణ (టోటల్) | 26.68 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 3.30 cr |
| ఓవర్సీస్ | 3.25 cr |
| టోటల్ వరల్డ్ వైడ్ | 33.23 cr (షేర్) |
‘నేను లోకల్’ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.20 కోట్లు కలెక్ట్ చేయాలి. ఫిబ్రవరి వంటి అన్ సీజన్లో రిలీజ్ అయినప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.33.23 కోట్ల షేర్ ను రాబట్టింది.బయ్యర్స్ కి రూ.13.23 కోట్ల భారీ లాభాలు అందించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.