Suma: డబ్బు కుక్కను కూడా విసిగించాలా?

తెలుగు సినీ ఇండస్ట్రీలో యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సుమ ఒకరు. ఈమె గత రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో యాంకర్ గా కొనసాగుతూ ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించడమే కాకుండా, సినిమా ఈవెంట్లకు కూడా యాంకర్ గా వ్యవహరిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ యాంకర్ గా సుమ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

ఇక సుమ ఒకవైపు పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూనే మరోవైపు సినిమా ఈవెంట్లను కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన అన్ని వీడియోలను అభిమానులతో పంచుకుంటారు. అలాగే ఇంస్టాగ్రామ్ ద్వారా కూడా ఎన్నో రకాల వీడియోలు షేర్ చేయడమే కాకుండా కొన్ని బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా భారీగా సంపాదిస్తున్నారు.

ఇలా తనకు అవకాశం ఉన్న ప్రతి ఒక్క ఫ్లాట్ ఫామ్ ని ఉపయోగించుకొని ఈమె భారీగా సంపాదిస్తున్నారని చెప్పాలి. అయితే తాజాగా ఈమె తన పెట్ డాగ్ తో ఒక ఫన్నీ వీడియో చేశారు. అది ప్రశాంతంగా నిద్రపోతూ ఉండగా సుమ దానిని లేపడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ విసిగిస్తుంది. దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసినటువంటి వారు ఎంతోమంది వివిధ రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేయగా మరికొందరు మాత్రం ట్రోల్ చేస్తున్నారు.

అది ఏదో ప్రశాంతంగా పడుకుంది దానిని పడుకొనివ్వు (Suma) సుమక్క ఎందుకు అలా దానిని డిస్టర్బ్ చేస్తున్నావు అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు మాత్రం ఇప్పటికే యాంకర్ గా బోలెడు సంపాదించావు యూట్యూబ్ ద్వారా కూడా సంపాదిస్తున్నారు తిరిగి ఇలా ఇంస్టాగ్రామ్ ద్వారా కూడా ఇలాంటి వీడియోలు చేస్తూ డబ్బు సంపాదిస్తున్నావా సుమ అంటూ భారీగా ఈమె పట్ల నెటిజన్స్ చేస్తున్నటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus