Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

తెలుగు సినిమాకు తెలంగాణలో కొత్త నిబంధనలు వచ్చాయి. అలాగే కొత్త టికెట్‌ రేట్లు కూడా వచ్చాయి. రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలను స్థిరీకరిస్తూ ఈ మేరకు రాష్ట్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వసతుల ఆధారంగా సినిమా హాళ్లను కేటగిరీలుగా విభజించి టికెట్‌ ధరలను నిర్ణయించింది. మల్టీప్లెక్స్‌ల తరహాలో డిజిటల్‌ సౌండ్‌ సిస్టం, ప్రొజక్షన్, నాణ్యమైన సీట్లు వంటి ప్రమాణాలు పాటిస్తున్న సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లను స్పెషల్‌ థియేటర్లుగా నిర్ణయించడం ఈ నిర్ణయంలో కీలకంగా నిలిచింది. ఇలాంటి థియేటర్లను గుర్తించేందుకు జిల్లా కలెక్టర్‌/ పోలీసు కమిషనర్‌ను నోడల్‌ అధికారిగా నియమించింది.

Ticket Price

అలాగే సినిమా బడ్జెట్‌లను లెక్కించే విధానంలో కొత్తగా సూపర్‌ హైబడ్జెట్‌ సినిమా అనేది వచ్చింది. ఈ సినిమాలు విడుదల అయిన తొలి పది రోజులపాటు టికెట్‌ ధరలు పెంచుకునే అవకాశం కల్పించారు. అయితే ఆ సినిమా నిర్మాత తొలుత ‘తెలుగు సినిమా పరిశ్రమ సంక్షేమ కమిటీ’ ఖాతాలో రూ.కోటి జమ చేయాలి. ఈ సంఘం సినిమా కార్మికుల సంక్షేమానికి ఆ డబ్బు ఖర్చపెడుతుంది. షోల సంగతిలోనూ మార్పులు చేశారు. ఇకపై రోజుకు ఉదయం 8 నుంచి రాత్రి ఒంటి గంట రోజుకు ఐదు షోలు వేసుకోవచ్చు. అయితే ఆ షోలలో ఒకటి చిన్న బడ్జెట్‌ సినిమాకు కేటాయించాలి. పండగ రోజుల్లోనూ దీనిని అమలు చేయాలి.

ఇక కొత్త టికెట్‌ రేట్ల సంగతి చూస్తే..
నాన్‌ ఏసీ థియేటర్లలో.. నాన్‌ ప్రీమియం కేటగిరీ టికెట్ల ధర కనిష్ఠంగా రూ.30, గరిష్ఠంగా రూ.70 ఉంటుంది. ప్రీమియం టికెట్ల ధర కనిష్ఠంగా రూ.50, గరిష్ఠంగా రూ.100గా నిర్ణయించారు. ఏసీ థియేటర్లలో.. నాన్‌ ప్రీమియం కేటగిరీ టికెట్ల ధర కనిష్ఠంగా రూ.50, గరిష్ఠంగా రూ.150గా ఉంటుంది. ప్రీమియం కేటగిరీ టికెట్ల ధర కనిష్ఠంగా రూ.100, గరిష్ఠంగా రూ.200గా నిర్ణయించారు. స్పెషల్‌ థియేటర్లలో నాన్‌ ప్రీమియం కేటగిరీ టికెట్‌ రేట్లు కనిష్ఠంగా రూ.100, గరిష్ఠంగా రూ.250 పెట్టగా.. ప్రీమియం రిక్లయినర్లకు కనిష్ఠంగా రూ.200, గరిష్ఠంగా రూ.300గా నిర్ణయించారు. మల్టీప్లెక్స్‌ల్లో రెగ్యులర్‌ టికెట్లు కనిష్ఠంగా రూ.100, గరిష్ఠంగా రూ.250 ఉంచారు. రిక్లయినర్లకు కనిష్ఠంగా రూ.200, గరిష్ఠంగా రూ.300గా పెట్టారు.

‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags