ప్రముఖ కథానాయకుడు అల్లు అర్జున్ – ప్రముఖ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘రాకా’. కొన్ని నెలల క్రితం మొదలైన ఈ సినిమా షూటింగ్ దాదాపు ముంబయిలోని ఓ స్టూడియోలోనే జరుగుతోంది. అక్కడే ఎందుకు? హైదరాబాద్‌లో కూడా అంతటి పెద్ద స్టూడియోస్ ఉన్నాయి కదా అనే డౌట్ రావొచ్చు. ఈ ప్రశ్నకు సమాధానం సినిమా రిలీజ్ ప్రచారం మొదలయ్యాక తెలియొచ్చు. ఆ విషయం పక్కన పెడితే ఈ సినిమా రూమర్లు హోరు ఇప్పుడు మన దేశం వదిలి వేరే దేశాల వరకు వెళ్లిపోయింది.
‘రాకా’ సినిమాను ఫాలో అవుతున్నవాళ్లకు వాళ్ల ప్రచారం ఎలా జరుగుతోందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతకొన్ని నెలలుగా రకరకాల రూమర్లు బయటకు వస్తున్నాయి. క్లియర్‌గా, అఫీషియల్‌గా బయటకు వచ్చిన సమాచారం అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరో అని, అట్లీ డైరక్టర్ అని, ఓ హీరోయిన్‌గా దీపిక పడుకొణె నటిస్తోందని మాత్రం. అవి కాకుండా మిగిలిన కాస్టింగ్ అంతా రూమర్లే. ఇప్పుడు ఈ రూమర్ల జాబితాలోకి ప్రముఖ హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ కూడా వచ్చాడు.
ఈ విషయమై సినిమా నిర్మాతలు గత కొన్ని నెలలుగా విల్ స్మిత్‌ను హ్యాండిల్‌ను సంస్థతో చర్చలు జరుపుతున్నారట. ఇంకా అటు నుండి ఎలాంటి అధికారిక సమాచారం లేదట. అయితే రీసెంట్‌గా కాస్త పాజిటివ్ రిప్లైలు వచ్చాయని తెలుస్తోంది. ఒకవేళ ఇదే కనుక జరిగితే ఈ సినిమా ఇకపై ఇంటర్నేషనల్ మార్కెట్‌లో అల్లు అర్జున్ సినిమాగా కాకుండా.. విల్ స్మిత్ సినిమాగా వెళ్లే అవకాశం ఉంది. ఇక బాలీవుడ్‌లో ఈ సినిమాకు ఓ హీరో ప్యాడింగ్ కోసం చూస్తున్నారు. అది షారుఖ్ ఖానా లేక షాహిద్ కపూరా అనేది ఇంకా తేలలేదు.
ఇక పాత పుకార్ల గురించి చూస్తే.. ఈ సినిమాలో నలుగురు హీరోయిన్స్ ఉంటారని జోరుగా ప్రచారం జరుగుతోంది. జాన్వీ కపూర్, రష్మిక మందన, మృణాల్ ఠాకూర్ పేర్లు తెరపైకి వచ్చాయి. వీటిపై ఇంకా ఏ క్లారిటీ లేదు. ఈ సినిమా వచ్చే ఏడాది ఓ లాంగ్ వీకెండ్ డేట్ చూసి రిలీజ్ చేస్తారట.