Prabhas: ప్రభాస్ సలార్ సినిమాకు కొత్త కష్టాలు.. అసలేం జరిగిందంటే?

  • November 9, 2023 / 01:33 PM IST

ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సలార్ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. సలార్ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా సలార్1 డిసెంబర్ నెల 22వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదని మేకర్స్ నుంచి అధికారికంగా క్లారిటీ వచ్చేసింది. ప్రభాస్ ఇండియాకు వచ్చేయడంతో త్వరలో ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుకానున్నాయి. సలార్ ట్రైలర్ రిలీజ్ డేట్ గురించి స్పష్టత వస్తే బాగుంటుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

డుంకీ, సలార్ సినిమాలు కొన్ని గంటల గ్యాప్ లో థియేటర్లలో విడుదల కానున్నాయి. అయితే ఈ సినిమా బిజినెస్ కు సంబంధించి షాకింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. సలార్ సినిమా హిందీ హక్కులను మొదట తీసుకున్న సంస్థ అందుకు సంబంధించిన అగ్రిమెంట్ ను క్యాన్సిల్ చేసుకుందని వైరల్ అవుతున్న వార్తల సారాంశం. డుంకీ, సలార్ పోటీ వల్ల థియేటర్ల విషయంలో ఇబ్బందులు ఎదురుకావడంతో ఆ సంస్థ ఈ విధంగా చేసిందని తెలుస్తోంది.

ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కిన కేజీఎఫ్, కేజీఎఫ్2 నార్త్ బెల్ట్ లో రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించాయి. సలార్ సినిమాకు ప్రభాస్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా తోడు కావడం గమనార్హం. ప్రభాస్ తర్వాత సినిమాలకు సంబంధించి త్వరలో మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి. సలార్2 షూటింగ్ 70 శాతం పూర్తైందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

ప్రశాంత్ నీల్ కూడా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొని సినిమాపై అంచనాలు పెంచాల్సి ఉంది. ప్రశాంత్ నీల్ ప్రమోషన్స్ లో భాగంగా తర్వాత సినిమాలకు సంబంధించి క్లారిటీ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. (Prabhas) ప్రభాస్, ప్రశాంత్ నీల్ లను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus