ఆ తమిళ చిత్రంలో నిహారిక రొమాన్స్ ఓ రేంజ్ లో..!

  • April 21, 2020 / 08:09 PM IST

మెగా ఫ్యామిలీ నుండి టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ నిహారిక కొణిదెల. మెగా బ్రదర్ నాగబాబు కూతురు అయిన నిహారిక 2016లో వచ్చిన ఒక మనసు అనే చిత్రంతో వెండి తెరకు హీరోయిన్ గా పరిచయం అయింది. నాగ శౌర్య హీరోగా సెన్సిబుల్ అండ్ ట్రాజిక్ లవ్ స్టోరీగా వచ్చిన ఒక మనసు ఫలితం ఇవ్వలేదు. ఆ అతదుపరి చిత్రంగా తమిళ్ మూవీ చేశారు.. ఆ చిత్రం కూడా పరాజయమే. సుమంత్ అశ్విన్ హీరోగా వచ్చిన హ్యాపీ వెడ్డింగ్, ఆమె సోలోగా చేసిన సూర్యకాంతం కూడా ఆ హిట్ తలుపు తట్ట లేకపోయాయి.

ఇక గత ఏడాది చిరంజీవి హీరోగా దర్శకుడు సురేంధర్ రెడ్డి తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం సైరా లో ఓ గెస్ట్ రోల్ చేసింది. హీరోయిన్ గా ఎదగాలనుకుంటున్న నిహారికకు మాత్రం ఇంత వరకు బ్రేక్ రాలేదు. కాగా యాంకర్ రవితో పాటు నిహారిక ఇంస్టాగ్రామ్ చాట్ లో పాల్గొనగా ఆమెను పెళ్లి… ఆపై నటన గురించి అడిగారు కొందరు. ఐతే పెళ్లి తరువాత నటించడానికి నేను సమంతను కాదు. అయినా ఆ విషయం నేనిప్పుడు చెప్పలేను.

అప్పటి పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది అన్నారు నిహారిక. ఇక నాకు ఎక్కువ సమయం లేదు.. వచ్చిన పాత్రలు ఎలాంటివైనా వదలకుండా చేస్తాను అన్నారు. రొమాంటిక్, గ్లామర్ రోల్స్ కూడా చేస్తాను… నా నెక్స్ట్ తమిళ్ మూవీ రొమాంటిక్ డ్రామాగా ఉండనుంది. కొన్ని రొమాంటిక్ సన్నివేశాల చిత్రీకరణ గోవా బీచ్ లో జరపనున్నాం అని చెప్పారు. నిహారిక ఇప్పటికే కొంచం హాట్ ఫోటో షూట్స్ లో పాల్గొంటుండగా మెగా ఫ్యాన్స్ నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. మరి గ్లామర్ రోల్స్ అంటే మెగా ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

Most Recommended Video

తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus