నాగార్జున టబు హీరో హీరోయిన్లుగా నటించినటువంటి సిసింద్రీ సినిమా ఎంత మంచి సక్సెస్ అయ్యిందో మనకు తెలిసిందే. ఇందులో ఆమని కొడుకు పాత్రలో నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ బాల నటుడిగా నటించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ పాత్రలో ముందుగా నిహారిక నటించాల్సి ఉండేది అంటూ తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు. ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి నిహారిక ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా నిహారిక తన వ్యక్తిగత విషయాల గురించి అలాగే విడాకుల గురించి కూడా మాట్లాడారు. ఈ క్రమంలోనే తాను పుట్టినప్పుడు తన తండ్రి ముగ్గురు మొనగాళ్లు సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారని తెలిపారు. మొదటినుంచి నాన్న అమ్మాయి కావాలని అనుకున్నారు కానీ వరుణ్ అన్న పుట్టారు. ఈసారి కచ్చితంగా పాప పడుతుందని నాన్న అనుకున్నారు.
నేను అపోలో హాస్పిటల్లో పుట్టానని కానీ అమ్మ డెలివరీ అయ్యే సమయానికి నాన్న షూటింగ్ లొకేషన్లో ఉన్నారని తెలిపారు. ఇక నేను పుట్టగానే పెదనాన్న పోలీస్ డ్రెస్ లోనే వచ్చి నన్ను చూశారంటూ నిహారిక తెలిపారు. నేను పుట్టగానే చాలా యాక్టివ్ గా ఉండే దానిని ఎనిమిది నెలలకే నడిచానని అమ్మ వాళ్ళు చెబుతూ ఉంటారు.
అదే సమయంలోనే సిసింద్రీ సినిమాకు పాకుతూ ఉండే ఒక చిన్నారి కావాలని ప్రయత్నిస్తున్న సమయంలో నన్ను కూడా ఈ సినిమాలో తీసుకోవాలని భావించారు. కానీ నేను అప్పటికి నడుస్తూ ఉండడంతో ఈ సినిమాలో నాకు బదులు అఖిల్ ను తీసుకున్నారు అంటూ నిహారిక (Niharika) ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!
‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!