Niharika: ఆ సినిమాల్లో నటించడానికి రెడీ.. నిహారిక కామెంట్స్ వైరల్!

  • March 12, 2024 / 06:08 PM IST

మెగా డాటర్ నిహారిక (Niharika) అందరికీ సుపరిచితమే. కెరీర్ ప్రారంభంలో పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించడమే కాకుండా బుల్లితెరపై ‘ఢీ’ వంటి డాన్స్ షోలకి మెంటర్ గా వ్యవహరించింది. హీరోయిన్ గా మారి ‘ఒక మనసు’ (Oka Manusu) ‘హ్యాపీ వెడ్డింగ్’ ‘సూర్యకాంతం’ (Suryakantham) వంటి సినిమాల్లో కూడా నటించింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. అయితే గతేడాది విడాకులు తీసుకుని అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది నిహారిక. అయితే ఇప్పుడు మళ్ళీ సినిమాల్లో బిజీ అవ్వాలని భావిస్తోంది.

పలు వెబ్ సిరీస్..లు, సినిమాలు నిర్మించడంతో పాటు ఆహా వారికోసం ఓ వంటల షో హోస్ట్ చేస్తుంది ఈ కొణిదెల వారి అమ్మాయి. దీని ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు పందుకుంది. నిహారిక మాట్లాడుతూ.. “నాకు ఈ మధ్య తిండి పిచ్చి బాగా ఎక్కువైంది. పప్పుచారు అంటే నాకు చాలా ఇష్టం. అది ఉంటే ఎక్కువ తింటాను. ప్రత్యేకంగా వండించుకుని కూడా తింటూ ఉంటాను.

అలాగే డబ్బులు సేవ్ చేసుకుని మరీ ట్రావెలింగ్ చేయడం మొదలుపెట్టాను. ఏదీ ప్లాన్ చేసుకుని చేయను. ఏది చేయాలనిపిస్తే అది చేసుకుంటూ వెళ్తుంటాను. నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. ఇప్పటివరకు నాకు నచ్చిన పాత్రలే చేశాను. కానీ నాకు కమర్షియల్ సినిమాల్లో ఛాన్సులు రాలేదు. ఇప్పటివరకు ఏ దర్శకుడు కూడా నాకు అలాంటి సినిమాలకి సంప్రదించలేదు. అడిగితే చేసేదాన్ని. ఆడిషన్స్ ఇస్తా.. పెద్ద కుటుంబం నుండి వచ్చాను..

నేనెందుకు ఆడిషన్స్ ఇవ్వాలి అని ఎప్పుడూ అనుకోలేదు. చెప్పాలంటే నాకు అడిషన్స్ ఇవ్వడం అంటే చాలా ఇష్టం. ఇప్పటికీ ఎవరైనా డైరెక్టర్ కమర్షియల్ సినిమాకి నన్ను ఆడిషన్స్ కి రమ్మంటే వెళ్తాను. ప్రస్తుతం నేను చేయబోతున్న వంటల షోలో పెద్దమ్మ సురేఖను, వదిన ఉపాసనని తీసుకొచ్చి వంటల షోలు చేయాలని చూస్తున్నాను. చూడాలి వర్కౌట్ అవుతుందో లేదో” అంటూ చెప్పుకొచ్చింది.

‘గామి’ తప్పకుండా చూడడానికి గల 10 కారణాలు!

స్టార్‌ హీరో అజిత్‌ హెల్త్‌ అప్‌డేట్‌ వచ్చేసింది… ఎలా ఉందంటే?
ఆ యూట్యూబ్ ఛానెల్స్ పై శరణ్య ప్రదీప్ ఫైర్.. ఏం జరిగిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus