Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

మెగా డాటర్ నిహారిక కొణిదెల ప్రస్తుతం తన కొత్త సినిమా “రాకాస” ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. సంగీత్ శోభన్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుండటంతో, ఆమె వరుస ఇంటర్వ్యూలతో హల్‌చల్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక ఇంటర్వ్యూలో మహిళల వస్త్రధారణపై నిహారిక చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.

Niharika Konidela

ఈ అంశంపై స్పందించిన నిహారిక, ‘మనమెలాంటి సందర్భానికి హాజరు అవుతున్నామో, దానికి తగ్గట్టుగా డ్రెస్సింగ్ ఉండాలి’ అంటూ క్లారిటీ ఇచ్చారు. పెళ్లికి వెళ్తే సంప్రదాయ దుస్తులు, పార్టీకి వెళ్తే ఆ సందర్భానికి సరిపోయే స్టైల్.. ఇదే సరైన బ్యాలెన్స్ అని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘ఇంట్లో మనకు నచ్చినట్లు ఉండొచ్చు, కానీ బయట సమాజంలో ఉన్నప్పుడు కొంత బాధ్యతతో వ్యవహరించాలి’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు.

అలాగే కుటుంబ సభ్యులు ఇచ్చే సూచనలు మన రక్షణ కోసమే అని నిహారిక వివరించారు. చిన్నప్పటి నుంచి తన తల్లిదండ్రులు కూడా ఇలాంటి విషయాల్లో గైడ్ చేసేవారని, మన మంచికోసమే వారు చెప్తారని ఆమె గుర్తుచేసుకున్నారు.

ఇక కెరీర్ విషయానికి వస్తే, నిహారిక ప్రయాణం నటిగా, ఇప్పుడు నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె నిర్మించిన సరికొత్త ప్రాజెక్టులతో డిజిటల్ స్పేస్‌లో తనదైన ముద్ర వేసింది. ఇటీవల “కమిటీ కుర్రోలు” వంటి సినిమాతో కూడా నిర్మాతగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇలా నటిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేకతను చాటుతూ ముందుకు సాగుతున్న నిహారిక.. ఇప్పుడు చేసిన ఈ కామెంట్స్‌తో మరోసారి వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో మాత్రం ఈ విషయం మీద ఎప్పుడూ డిబేట్ కొనసాగుతూనే ఉంటుంది.

RGV : ఇకనైనా అప్డేట్ అవ్వకపోతే వాళ్ళని దేవుడు కూడా కాపాడలేడు : ఆర్జీవీ

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus