మెగా డాటర్ నిహారికకు (Niharika) సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. కమిటీ కుర్రోళ్లు సినిమాతో నిహారిక నిర్మాతగా కూడా విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం నిహారిక పడిన కష్టం అంతాఇంతా కాదు. అయితే నిహారిక ఫస్ట్ శాలరీ ఎంత ఉంటుందనే ప్రశ్నకు ఎవరైనా లక్షల్లో ఉంటుందని ఫీలవుతారనే సంగతి తెలిసిందే. అయితే కేవలం వారానికి వెయ్యి రూపాయల జీతం కోసం కేఫ్ లో పని చేశానని నిహారిక చెప్పుకొచ్చారు.
సినిమాల్లోకి రాకముందు హైదరాబాద్ లోని ఒక కేఫ్ లో పని చేశానని ఆమె కామెంట్లు చేశారు. ఆ సమయంలో వారానికి 1000 రూపాయలు జీతంగా తీసుకున్నానని నిహారిక పేర్కొన్నారు. నా చదువంతా హైదరాబాద్ లోనే పూర్తైందని విదేశాలకు వెళ్లి చదువుకోవాలని భావించినా వెళ్లలేదని ఆమె చెప్పుకొచ్చారు. ఇంట్లో నన్ను ఎక్కడికీ పంపించేవారు కాదని నిహారిక చెప్పుకొచ్చారు. కమిటీ కుర్రోళ్లు సక్సెస్ సాధించిన నేపథ్యంలో నిహారిక ఇకపై భారీ బడ్జెట్ సినిమాల నిర్మాణం దిశగా అడుగులు వేస్తారేమో చూడాలి.
నిహారిక (Niharika Konidela) నటిగా కూడా కెరీర్ పరంగా బిజీగా ఉన్నారని త్వరలో కీలక అప్ డేట్స్ రానున్నాయని తెలుస్తోంది. నిహారిక రెమ్యునరేషన్ కూడా పరిమితంగానే ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. నిహారిక రాబోయే రోజుల్లో ఎలాంటి పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వస్తారేమో చూడాల్సి ఉంది. మెగా డాటర్ నిహారిక కెరీర్ ప్లానింగ్స్ ఏ విధంగా ఉండనున్నాయో తెలియాల్సి ఉంది.
నిహారిక టాలెంట్ కు తగిన గుర్తింపు దక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం నిహారికకు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. నిహారికకు ఇన్ స్టాగ్రామ్ లో ఏకంగా 2.4 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. నిహారికను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.