“ఎఫేర్” పై తేల్చేసిన నిఖిల్!!!

  • July 14, 2016 / 11:04 AM IST

టాలీవుడ్ లో హీరో హీరోయిన్స్ మధ్య ఎఫేర్స్ ఉండడం సర్వ సాధారణం. అయితే తెల్ల చీర కట్టిన ప్రతీ స్త్రీ నా భార్య అన్నట్లు ఇండస్ట్రీలో అందరూ ఒకేలాగ ఉండరు. ఇంతకీ విషయం ఏమిటంటే….కలర్స్ ప్రోగ్రామ్ తో బుల్లి తెరకు ఎంట్రీ ఇచ్చిన అందాల భామ స్వాతి అనేక సినిమాలో చిన్న చిన్న పాత్రలు చేసింది. అయితే తమిళంలో తాను హీరోయిన్ గా నటించిన కొన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్ కావడంతో ఈ అమ్మడికి పిచ్చ క్రేజ్ ఏర్పడటమే కాకుండా వరుస ఆఫర్స్ సైతం వచ్చాయి.

అదే క్రమంలో వరుసగా స్వామి రారా…కార్తికేయ వంటి హిట్స్ సైతం వచ్చాయి. ఇదిలా ఉంటే శేఖర్ కమ్ముల తీసిన “హ్యాపీ డేస్” సినిమాతో హీరోగా పరిచయం అయిన హీరో నిఖిల్ సైతం సోలో గా ఎన్నో ప్రయత్నాల తరువాత….స్వామిరారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య లాంటి వరుస హిట్స్ తో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇదిలా ఉంటే వీళ్ళిద్దరూ వరుస సినిమాల్లో చేస్తూ ఉండడంతో, వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అన్న టాక్స్ వినిపిస్తున్నాయి.

ఇక దీనిపై స్పందించిన నిఖిల్ మా ఇద్దరి మద్య ఎటువంటి ఎఫైర్ లేదని , మేమిద్దరం కేవలం మంచి ఫ్రెండ్స్ మాత్రమే ! కానీ ఎన్నిసార్లు చెప్పినా స్వాతి కి నాకు  మద్య ఏదో ఉన్నట్లు పదే పదే రాస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నాడు. అదే క్రమంలో ఎప్పుడైనా ఒకసారి స్వాతికి ఫోన్ చేసి మాట్లాడుతానని అది కూడా సినిమాల గురించే అని అంతమాత్రాన  రూమర్లు పుట్టించడం చాలా దారుణం అని నిఖిల్ బాధ పడుతున్నాడు. అయినా మీడియా అయినా కాస్త ముందు వెనుక చూసుకుని రాయడం కాస్త మంచిది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus