Nirupam Paritala: డాక్టర్ బాబు సినిమాల్లో సక్సెస్ కాకపోవడానికి అసలు కారణాలివే!

కార్తీకదీపం సీరియల్ ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న వాళ్లలో పరిటాల నిరుపమ్ ఒకరు కాగా నిరుపమ్ నటించిన సీరియల్స్ అన్నీ దాదాపుగా హిట్ అయ్యాయి. అయితే నిరుపమ్ పలు సినిమాలలో నటించినా ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించలేదు. అయితే సినిమాల్లో నిరుపమ్ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడానికి కారణమేంటనే ప్రశ్న ఎదురు కాగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుమారి శ్రీమతి వెబ్ సిరీస్ లో నిత్యామీనన్ కు జోడీగా నటించిన ఈ నటుడు వరుసగా సీరియళ్లలో నటిస్తున్న సమయంలో రెండు మూడు సినిమాల కోసం అడిషన్స్ ఇచ్చానని చెప్పుకొచ్చారు.

నేను సీరియళ్లలో నటిస్తున్నాననే కారణం చూపించి అడిషన్స్ లో నన్ను రిజెక్ట్ చేశారని నిరుపమ్ అన్నారు. ఆ సమయంలో ఏడుపు రావడంతో నాన్న ఫోటో ముందు తెగ ఏడ్చేశానని నిరుపమ్ కామెంట్లు చేయడం గమనార్హం. తండ్రి లేకపోవడం వల్ల సినిమాలకు సంబంధించి నన్ను న్యూ కామర్ లా ట్రీట్ చేస్తున్నారని నిరుపమ్ చెప్పుకొచ్చారు. నాకు సినిమా సర్కిల్ లేదని అందువల్ల సినిమా ఆఫర్ల కొరకు ఎవరి దగ్గరకు వెళ్లలేదని ఆయన కామెంట్లు చేశారు.

అప్పట్లో ఈ పరిస్థితి బాధ కలిగించినా టీవీ రంగంలో మాత్రం తాను హ్యాపీగా ఉన్నానని నిరుపమ్ అన్నారు. ప్రస్తుతం సినిమా ఆఫర్లు వస్తున్నాయని రాబోయే రోజుల్లో సినిమాలలో నటిస్తానని ఆయన కామెంట్లు చేశారు. నిరుపమ్ రాబోయే రోజుల్లో ఎలాంటి సంచలనాలను సృష్టిస్తారో చూడాల్సి ఉంది. నిరుపమ్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండగా సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.

నిరుపమ్ (Nirupam Paritala) నటించిన సీరియళ్లకు మంచి రేటింగ్స్ వస్తున్నాయి. భవిష్యత్తులో నిరుపమ్ కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నిరుపమ్ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్నారు. నిరుపమ్ టాలెంట్ ను సరిగ్గా వినియోగించుకుంటే సంచలనాలు సృష్టించే ఛాన్స్ అయితే ఉంది.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus