Karthika Deepam: ‘కార్తీక దీపం’ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన డాక్టర్ బాబు!

కార్తీక దీపం సీరియల్ కి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో.. ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సాయంత్రం ఏడు దాటింది అంటే.. టీవీ రిమోట్లు చేతిలో పెట్టుకుని గృహిణిలు రెడీగా ఉండేవారు. ఆ సీరియల్లో డాక్టర్ బాబు, వంటలక్క ల పాత్రల గురించి ఎంతో ఆసక్తిగా చూసేవారు. సోషల్ మీడియాలో ఆ పాత్రల పై వచ్చే మీమ్స్ అన్నీ ఇన్నీ కాదు. అయితే ఈ సీరియల్ ముగిసి చాలా కాలం అయ్యింది. కానీ సరైన ఎండింగ్ ఇవ్వలేదు..అని కొందరు అంటున్నారు.

పార్ట్ 2 కి ఛాన్స్ ఉంది అని కూడా ఆశపడుతున్నారు. తాజాగా దీనిపై డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ స్పందించాడు. నిరుపమ్ మాట్లాడుతూ.. ‘నేను ఇప్పటికీ ఎక్కడ కనిపించినా జనాలు డాక్టర్ బాబు అనే పిలుస్తుంటారు. వంటలక్క ఎక్కడ అని అడుగుతుంటారు.నా పేరు మర్చిపోయి నన్ను డాక్టర్ బాబు గానే గుర్తుపెట్టుకున్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో గొడవలు ఉంటాయి. అందుకే (Karthika Deepam) ‘కార్తీక దీపం’ సీరియల్ అందరికీ కనెక్ట్ అయ్యింది అని నేను అనుకుంటున్నాను.

నా భార్యతో బయటికి వెళ్తే వంటలక్క గురించి చాలా మంది అడుగుతుంటారు. అవి విన్నప్పుడు నా భార్య నవ్వేసి ఊరుకుంటుంది. నాకు తెలిసినంత వరకు ‘కార్తీక దీపం’ కి పార్ట్ 2 అనేది ఉండదు. ఎందుకంటే అంతలా కనెక్ట్ అయ్యే ఎమోషన్ ని పుట్టించడం సాధ్యం కాదు. అన్నీ కుదిరితేనే పార్ట్ 2 చేయాలి. లేదంటే టచ్ చెయ్యకపోవడమే మంచిది. కానీ ప్రేమితో మరో సీరియల్ చేసే ఛాన్స్ ఉండవచ్చు. మా కాంబినేషన్ ఎలాగూ సక్సెస్ అయ్యింది కాబట్టి.. ఛాన్సులు ఉన్నాయి” అంటూ క్లారిటీ ఇచ్చాడు.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus