నితిన్ కి(Nithiin) బ్యాడ్ టైమ్ నడుస్తుంది. అతను చేసిన సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. రిజెక్ట్ చేసిన సినిమాలు హిట్ అవుతున్నాయి అని చాలా మంది అంటున్నారు. ‘ఎల్లమ్మ’ లాంటి సినిమా నితిన్ చేజారిపోయింది. అలా అని నితిన్ రిజెక్ట్ చేసిన ‘తెలుసు కదా’ వంటి సినిమాలు ఏమీ ఆడలేదు. అయితే ఏది ఏమైనా ‘భీష్మ’ తర్వాత నితిన్ చేసిన సినిమాలు అల్మోస్ట్ ఫ్లాప్ అయ్యాయి. ‘రంగ్ దే’ మినహా ‘చెక్’ ‘మార్చర్ల నియోజకవర్గం’ ‘ఎక్స్ ట్రా’ ‘రాబిన్ హుడ్’ ‘తమ్ముడు’ వంటి సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి.
సో నితిన్ ఇప్పుడు కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితుల్లో ఉన్నాడు. విక్రమ్ కుమార్, శ్రీను వైట్ల వంటి దర్శకులతో సినిమాలు సెట్ అయినట్టు అయ్యి.. పక్కకి వెళ్లిపోయాయి. దీంతో నితిన్ నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ చేస్తున్నాడు అనే సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ నేపధ్యంలో ఓ దర్శకుడు చెప్పిన కథని నితిన్ విని ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే.. 2024 లో నార్నే నితిన్ హీరోగా ‘ఆయ్’ అనే సినిమా వచ్చింది. అంజి కె మణిపుత్ర ఈ చిత్రానికి దర్శకుడు. ఇదొక సైలెంట్ హిట్ సినిమా.
అయితే వాస్తవానికి ఇదే కథని.. దర్శకుడు అంజి నవీన్ పోలిశెట్టికి వినిపించాడట. అయితే అప్పటికే గోదావరి నేపధ్యంలో ‘అనగనగా ఒక రాజు’ చేయడానికి నవీన్ రెడీ అవ్వడంతో.. అంజి కథని పక్కన పెట్టినట్టు తెలుస్తుంది.ఈ సినిమాతో అయినా నితిన్ హిట్టు కొట్టి కొంబ్యాక్ ఇస్తాడేమో చూడాలి.