Jayavahini: క్యాన్సర్ తో బుల్లితెర నటి మృతి

సినీ పరిశ్రమని విషాదాలు వీడటం లేదు. నిత్యం ఎవరోకరు ఏదో ఒక విధంగా మరణిస్తూనే ఉన్నారు. తాజాగా మరో విషాదం చోటు చేసుకుంది.

Jayavahini

వివరాల్లోకి వెళితే.. బుల్లితెర నటి జయ వాహిని ఈరోజు కన్నుమూశారు. కొన్నాళ్ళుగా క్యాన్సర్ తో బాధపడుతూ వస్తున్న.. ఆమె ట్రీట్మెంట్ కి డబ్బులు లేక ఆర్దికంగా చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ దశలో కరాటే కళ్యాణి, నటి ప్రియా వంటి వారు ఈమెకు సాయం అందించారు. అలాగే జయ వాహిని పరిస్థితి వివరిస్తూ తమ వంతు కాంపెయిన్స్ వంటివి చేసి మరికొంత మండి సాయ పడేలా చేశారు. అయితే వారు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఈరోజు పరిస్థితి విషమించడంతో జయ వాహిని కన్నుమూశారు.

జయ వాహిని సొంత ఊరు ఆంధ్రప్రదేశ్, శ్రీకాకుళం. అందుకే ఆమె పర్దీవ దేహాన్ని అక్కడికి తరలించారట కుటుంబ సభ్యులు. అంత్యక్రియలు కూడా అక్కడే నిర్వహించబోతున్నట్టు సమాచారం. జయ వాహిని మరణవార్తని ముందుగా నటి కరాటే కళ్యాణి వెల్లడించారు. ఆమెను కాపాడుకోవడానికి ఎంతో ప్రయత్నించినప్పటికీ..రక్షించుకోలేకపోయామని చెప్పుకొచ్చింది కరాటే కళ్యాణి.

ఇక సీరియల్స్ తో కెరీర్ ప్రారంభించిన జయ వాహిని.. అనేక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో రూపొందిన సినిమాల్లో కూడా ఈమె నటించారు. గతేడాది వచ్చిన కళ్యాణ్ రామ్ ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ సినిమాలో కూడా జయవాహిని నటించారు. ఇక ఆమె మరణవార్తకి చింతిస్తూ కొంతమంది సినీ సెలబ్రిటీలు సంతాపం తెలుపుతూ కొమెంట్లు పెడుతున్నారు.

ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus