‘సై’ (Sye) తర్వాత నితిన్ (Nithiin) కి చాలా ప్లాపులు పడ్డాయి. ‘ధైర్యం’ (Dhairyam) ‘అల్లరి బుల్లోడు’ (Allari Bullodu) ‘రామ్’ (Raam) అబ్బో ఇలా లెక్కేసుకుంటే చాలా ప్లాపులు ఉన్నాయి. కొన్ని సినిమాలు అయితే వచ్చి వెళ్లినట్టు కూడా చాలా మందికి తెలీదు. దీంతో నితిన్ (Nithiin) కెరీర్ ముగిసింది అని అంతా అనుకున్నారు. స్టార్ దర్శకులు అయితే నితిన్ ఎదురుపడితే.. ఎక్కడ సినిమా చేయమని అడుగుతాడో అని మొహం పక్కకి పెట్టుకుని వెళ్లిపోయేవారట.
కానీ సొంత నిర్మాణంలో ‘ఇష్క్’ ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాలతో విజయాలు అందుకుని మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు. ఆ తర్వాత సంగతి తెలిసిందే. అయితే 2008లో నితిన్ కెరీర్ సెట్ అవుతుందేమో అని అంతా భావించారు. ఆ ఏడాది సమ్మర్ కి అంటే మార్చి 20న ‘ఆటాడిస్తా’ అనే సినిమా వచ్చింది. అది పర్వాలేదు అన్నట్టు ఆడింది. ఆ వెంటనే అంటే ‘విక్టరీ’ వస్తున్నట్టు ప్రకటించారు.
ఈ సినిమా కోసం నితిన్ 8 ప్యాక్ బాడీని బిల్డ్ చేశాడు. అల్లు అర్జున్ (Allu Arjun) ‘దేశముదురు’ (Desamuduru) తో 6 ప్యాక్ చేస్తే.. నితిన్ (Nithiin) ‘విక్టరీ’ (Victory) కోసం 8 ప్యాక్ చేయడం ఆ రోజుల్లో ప్రత్యేకతను సంతరించుకుంది. ‘సామాన్యుడు’ అనే హిట్ సినిమా తీసిన రవికుమార్ చావలి ఈ చిత్రానికి దర్శకుడు. సినిమా బాగానే ఉంటుంది. హైదరాబాద్ లో జరిగే భూ కబ్జా థీమ్ తో రూపొందిన సినిమా ఇది. దర్శకుడు టచ్ చేసిన సోషల్ ఎలిమెంట్ కి మంచి అప్లాజ్ వచ్చింది.
కొంచెం అక్కడక్కడా ఫ్లాస్ ఉన్నా సినిమా టేకింగ్ బాగానే ఉంటుంది. ‘బిజినెస్ మెన్’ (Businessman) వంటి కల్ట్ సినిమాని అందించిన ‘ఆర్.ఆర్ మూవీ మేకర్స్’ ఈ సినిమాను నిర్మించారు. కానీ రిలీజ్ టైంకి సరైన విధంగా సినిమాను ప్రమోట్ చేయలేదు. అందుకే జూన్ 27న రిలీజ్ అయిన ఈ సినిమా ప్లాప్ గా మిగిలిపోయింది. పలు ఇంటర్వ్యూల్లో నితిన్ (Nithiin) ‘నేను మంచి కథలు ఎంపిక చేసుకున్నా, సినిమా బాగా వచ్చినా కొన్ని రాంగ్ టైంలో రిలీజ్ అవ్వడం, ప్రమోషన్స్ సరిగ్గా జరగకపోవడం వల్ల కూడా నిరాశపరిచాయి’ అంటూ చెప్పుకొచ్చాడు.