Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

నితిన్‌ కెరీర్‌ ఆ మధ్య ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నట్లు కనిపించింది. అయితే ఇదంతా ఐదేళ్ల క్రితం వరకే. ‘మాస్ట్రో’ సినిమా వరకే ఇదంతా. ఆ సినిమా తర్వాత నాలుగు సినిమాలు చేస్తే.. నాలుగూ ఇబ్బందికర ఫలితాలే ఎదురయ్యాయి. ఆ ఎఫెక్ట్‌ ఎంత బలంగా నితిన్‌ మీద పడింది అంటే ఆఖరి సినిమా ‘తమ్ముడు’ వచ్చి ఏడాది దాటిపోయినా ఇంకా కొత్త సినిమా ముచ్చట్లు ఏవీ బయటకు రావడం లేదు. నితిన్‌ ఏదో సినిమా చేస్తున్నాడు అని అంటున్నారు తప్ప.. ఏ సినిమా చేస్తున్నాడో కచ్చితంగా తెలియడం లేదు.

Nithin – Nani

వరుసగా రెగ్యులర్‌ సినిమాలు చేస్తూ వచ్చిన నితిన్‌.. ఇప్పుడు పూర్తిగా జోనర్‌లు మార్చే పనిలో పడ్డాడు. ఈ క్రమంలో ఓ సైన్స్‌ ఫిక్షన్‌ సినిమా చేస్తున్నాడని టాక్‌. ఈ సినిమా పూర్తి కాకుండానే మరో రెండు కథలను ఓకే చేసి, పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడట. ‘ఆయ్‌’ సినిమాతో తొలి ప్రయత్నంలోనే ప్రేక్షకుల్ని మెప్పించిన దర్శకుడు అంజి. ఆయన ఇటీవల చెప్పిన కథకు నితిన్‌ ఓకే చెప్పారని టాక్‌. సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్‌ మూవీస్‌లోనే ఈ సినిమాను నిర్మించనున్నట్లు తెలిసింది..

ఈ సినిమాలో పార్టనరా లేక మరో సినిమానో కానీ.. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌లో కూడా ఓ సినిమా రూపొందుతోంది. ఆ తర్వాత ‘దండోరా’ సినిమా ఫేమ్‌ మురళీ కాంత్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేసే ఆలోచనలో నితిన్‌ ఉన్నాడట. ఈ ప్రాజెక్ట్‌ని నితిన్‌ దగ్గరకు తెచ్చింది హీరో నాని అట. ఎందుకంటే ఆ సినిమా ఆయనే నిర్మాత అని చెబుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి కథా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే సినిమా అనౌన్స్‌మెంట్‌ ఉంటుంది అని చెబుతున్నారు.

అయితే, పైన చెప్పిన ప్రాజెక్ట్‌ల విషయంలో ఎక్కడా నితిన్‌ నుండి కానీ, ఆ సినిమాల నిర్మాత నుండి కానీ ఎలాంటి అధికారిక సమాచారం అయితే లేదు.

నాగచైతన్య 25వ సినిమా ఏది? చర్చలోకి ఇద్దరు దర్శకుల పేర్లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus